Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో

పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో

Samatha J

|

Updated on: Apr 08, 2025 | 4:22 PM

మృత్యువు ఏ సమయంలో ఎవర్ని ఎలా కబళిస్తుందో తెలీదు. ఈ మధ్య ఓ లోకోపైలట్‌ పదవీ విరమణ రోజునే రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి.. ఉద్యోగంనుంచే కాకుండ జీవితంనుంచే విరమణ తీసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందిం. అలాంటిదే మరో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా మృత్యు ఒడికి చేరారు ఓ వైమానికదళ పైలట్‌. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఐఏఎఫ్‌ స్టేషను సమీప గ్రామ మైదానంలో బుధవారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైమానిక దళ పైలట్‌ సిద్ధార్థ్‌ యాదవ్‌ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాద సమయంలో ఆయన వ్యవహరించిన తీరు అందరి హృదయాలను హత్తుకుంటోంది. ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసిన క్లిష్టపరిస్థితుల్లోనూ ఆయన తన గురించి ఆలోచించకుండా తోటి పైలట్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. మరో పైలట్‌ను ఫైటర్‌ జెట్‌ నుంచి బయటపడేసి తాను మృత్యుఒడికి చేరారు. అంతేకాదు.. పౌరులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించి నివాస ప్రాంతాలకు దూరంగా విమానాన్ని తీసుకెళ్లారు. అత్యంత విషాధకరమైన విషయం ఏంటంటే.. సిద్ధార్థ్‌కు 10 రోజుల కిందటే ఢిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన అతడు.. అంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడిపెట్టిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం

సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో

భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో

పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?

కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ