కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ
మహాకుంభమేళంలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్మే సోషల్ మీడియాలో వైరల్ అయిన అమ్మాయి మోనా లిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే సనోజ్ మిశ్రా బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిందని దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఝాన్సీకి చెందిన ఓ యువతికి సినిమాలో పాత్ర ఇప్పిస్తానని ప్రలోభపెట్టాడని దర్శకుడు సనోజ్ మిశ్రా పై ఆరోపణలు వచ్చాయి.
సదరు అమ్మాయిని శారీరకంగా వేధించడంతో పాటు బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 2020లో టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా సనోజ్ మిశ్రాతో యువతికి పరిచయం అయింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి సనోజ్ తరచు ఫోన్ చేసేవాడని 17 జూన్ 2021న తనకు కాల్ చేసి తనని కలిసేందుకు ఝాన్సీ రైల్వే స్టేషన్ కు రావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2021 జూన్ 17న మరోసారి ఫోన్ చేసి రైల్వే స్టేషన్ కు రాకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో గత్యంతరం లేక అతను చెప్పిన చోటికి వెళ్ళానని చెప్పింది. అక్కడి నుంచి సనోజ్ తనను ఓ రిసార్ట్ కు తీసుకువెళ్లి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సనోజ్ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో ముంబై నుంచి వచ్చి అతడితోనే సహజీవనం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.