పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
తల్లిని మించిన దైవం లేదు అంటారు. అమ్మ పొత్తిళ్లు, పసికందుకు ఒక భరోసా. అమ్మ లాలిపాట చంటిపాపకు ఒక ధైర్యం. మనుషులకే కాదు. సృష్టిలోని ప్రతి జీవికి మొదటి రక్షణ కవచం అమ్మ. ఏ జీవి అయినా ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఆ బిడ్డ స్వతంత్రంగా జీవించగలిగేంత వరకు అండగా ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ పెద్ద పులి తన కూనలను ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఒక చోటి నుంచి మరో చోటికి తరలిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మైసూరులోని దండనకట్టెలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం పర్యాటకుల హృదయాలను తాకింది. వన్యమృగాలను దగ్గర నుంచి చూడాలని కొందరు జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు సఫారీలకు వెళుతుంటారు. అలా కొందరు వెళ్ళిన సమయంలో ఓ పెద్ద పులి తన పులి కూనలతో కలిసి రోడ్డు దాటుతోంది. దూరంగా వాహనంలో ఉన్నవారు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. పులి పిల్లల్లో ఒకదాన్ని నోట కరుచుకొని ముందు నడుచుకుంటూ వెళుతుండగా మిగతా పులి కూనలు తల్లిపులిని అనుసరిన్చాయి. ఈ క్యూట్ దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాలలో బంధించారు. ఎప్పుడూ జంతువులను వేటాడుతూ గంభీరంగా కనిపించే పెద్ద పులిలో తల్లి ప్రేమను చూసి ముగ్దులైపోయారు. చిటి చిటి అడుగులతో తల్లి వెంట పరుగెడుతున్న చిన్ని చిన్ని పులి కూనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లను సైతం కట్టిపడేస్తోంది.

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో
