ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో
రోడ్డు మీద వాహనాలపై కానీ నడిచి కానీ వెళుతున్నప్పుడు ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాహనాల కారణంగానో మరో రూపంలోనో ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతుంటారు. అయితే ఆవగించంత ఆయుష్షు ఉన్నా బ్రతికి బట్టకట్టవచ్చని పెద్దలు చెబుతుంటారు.
ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఓ వ్యక్తి బైక్ పై వెళుతూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్ స్కూటర్ పై వెళుతున్నాడు. అతను వెళుతున్న రోడ్డు పక్కన ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ రోడ్డు మీదగా పలు వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. సడన్ గా డెలివరీ బాయ్ కూడా అదే రోడ్డుపై వెళుతున్నాడు. సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది. రెప్పపాటులో ఆ డెలివరీ బాయ్ స్కూటర్ ముందుకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. వెన్ను వణుకు పుట్టిస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. చెట్టు కొమ్మలు విరిగి పడటంతో డెలివరీ బాయ్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

