అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
విమానం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. అందులోని ప్రయాణికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఫ్లైట్ ని పైలట్లు మార్గమధ్యంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా చనిపోవడంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతుడిని అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్‌గా గుర్తించారు.
ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్‌తో బయలుదేరారు. అయితే ఢిల్లీ చేరుకోకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. సతీష్ బర్మన్ మరణించడంతో విమాన సిబ్బంది.. ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సతీష్ బర్మన్ ఆరోగ్యం విషమంగా ఉందని గమనించిన సిబ్బంది.. వెంటనే స్పందించి విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. కానీ ల్యాండింగ్ కు ముందే సతీష్ చనిపోవడం విషాదకరం. ఇటీవల సూరత్-కోల్‌కతా విమానంలో ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. విమానంలోని వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడం గమనించిన సిబ్బంది తనిఖీలు చేపట్టి, పశ్చిమబెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ బ్యాగ్‌లో బీడీలు మరియు అగ్గిపెట్టె ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు అధికారులు గుర్తించి, వెంటనే అతడిని విమానంలోని ప్రదేశం నుంచి దింపారు.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
