భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
టెక్నాలజీ యుగంలో మనిషి ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు. అంతరిక్షానికి సైతం రాకపోకలు సాగిస్తున్న ఆధునిక యుగంలోనూ మనుషులు మూఢనమ్మకాలు వీడటం లేదా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ ఘటన చూస్తే. ఓ వ్యక్తి తాను భూదేవి పుత్రుడినని తరచు భూమాత తన ఒంట్లోకి వస్తుందని తాను భూగర్భంలోకి వెళ్ళిపోతాను అంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో సకాలంలో అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి దీక్షను భగ్నం చేయడంతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపు కోటిరెడ్డి కొన్నేళ్ల క్రితం ఊరి చివరిలోని తన పొలంలో భూదేవి అమ్మవారి ఆలయం నిర్మించాడు. అక్కడ నిత్యం పూజలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆలయ సమీపంలో ఆరు అడుగుల గొయ్యి తవ్వి అందులోకి వెళ్లి రోజూ ధ్యానం చేస్తున్నాడు. అంతేకాదు ఉగాది రోజు తాను జీవ సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున కుమారుడిని వెంటబెట్టుకొని ఆలయం వద్దకు చేరుకున్నాడు. తాను జీవ సమాధి అవుతాను అని అందుకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గొయ్యిని కుమారుడికి చూపించి తాను గొయ్యి లోపలికి వెళ్లి ధ్యానం చేసుకుంటాను అని ఇనుప రేకును ఉంచి దానిపై మట్టితో పూడ్చివేయమని కుమారుడికి చెప్పి గొయ్యిలో నగ్నంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. తండ్రి చెప్పినట్లుగా కుమారుడు సమాధి చేశాడు. కోటిరెడ్డి జీవ సమాధి అవుతున్నాడన్న విషయం తెలుసుకొని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణం అక్కడికి చేరుకున్న పోలీసులు కోటిరెడ్డి దీక్షను భగ్నం చేసి ప్రాణాలతో బయటకు తీశారు. తాను ప్రపంచ శాంతి కోసం దీక్ష చేస్తున్నానని కోటిరెడ్డి చెబుతున్నాడు.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

