సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
సింహం అడవికి రాజు అంటారు. దాని రాజస్యం ముందు ఎంతటి జంతువైనా తలొంచాల్సిందే. సింహ గర్జన వినటనే అడవిలోని మిగతా జంతువులు ఎక్కడి దొంగలు అక్కడే గబ్బు చిప్ అన్నట్టుగా పారిపోతాయి. అటువంటి సింహం తోక పట్టుకొని ఆడిస్తున్నాడు ఒక చిన్న బాలుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది సింహమా? సుంకమా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంటి గుమ్మం ముందు ఒక సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. ఆ సమయంలో అక్కడికి ఒక బాలుడు వచ్చాడు. సింహాన్ని చూసి భయపడాల్సింది పోయి ఆ పిల్లవాడు అక్కడున్న ఆ సింహం తోక పట్టుకొని లాగుతూ ఆడుకుంటున్నాడు. అయినా ఆ సింహం బాలుడికి ఎలాంటి హాని తలపెట్టలేదు. కాసేపటికి అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. పిల్లవాడు సింహంతో ఆడటం చూసి నవ్వుతూ అక్కడి నుంచి బాలుడిని తీసుకు వెళ్ళాడు.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఒక జంతువుని ఇలా హింసించటం సరికాదని హెచ్చరికలు పలుకుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా 23 వేల మందికి పైగా లైక్ చేశారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
