AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో

తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో

Samatha J

|

Updated on: Apr 08, 2025 | 4:23 PM

క్రూజ్‌ షిప్‌ లో అక్కడి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అంతలోనే భారీ కుదుపులు.. ఎగిసిపడే రాకాసి అలలు .. ఉయ్యాలలా ఊగిన ఓడ .. చుట్టూ గాలి చేస్తున్న భీకర శబ్దాలు.. అప్పటిదాకా షిప్ పైన ఉన్న వారు గదుల్లోకి పరిగెత్తారు. ఓ వైపు మైక్‌లో ఎనౌన్స్‌మెంట్లు.. మరో వైపు వెన్నులో మొదలైన వణుకు, ఊహించిన ఉత్పాతాన్ని నౌక దాటగలదా? యస్‌ ఇదేమీ అనుకోకుండా జరిగిన సముద్ర ఉత్పాతం కాదు. ముందే ఊహించి ముందే ప్లాన్‌ చేసిన టూర్‌. భయంకరంగా ఉండే ఆ అనుభవాన్ని కళ్ళారా చూడాలని ఉవ్విళ్లూరే ధైర్యవంతుల కోసమే ఈ టూర్‌. ఇంతకీ ఈ అతి ప్రమాదకర సముద్ర ప్రయాణం ఎక్కడ చేస్తారో తెలుసా?

ఒళ్లు గగుర్పొడిచే డ్రేక్స్‌ పాసేజ్‌. ఈ ప్రయాణ వివరాలను డీటైల్డ్‌గా చూద్దాం ఈ స్టోరీలో.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సముద్ర మార్గం ఇది. ఈ పాసేజ్‌ గుండా ప్రయాణం మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా సాహసికుల కోసమే. క్రూజ్‌ షిప్‌ టూర్‌లు వీరి కోసమే. తన అనుభవాన్ని వీడియో తీసి లెస్లీ ఆన్‌ మర్ఫీ అనే మహిళ ఆ వీడియోను షేర్‌ చేసింది. వెంటనే వీడియో వైరల్‌ కావడం వేలల్లో లైక్‌లు కొట్టడం జరిగాయి. క్రూజ్‌ షిప్‌ లో అక్కడి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అంతలోనే భారీ కుదుపులు.. చుట్టుముట్టిన రాకాసి అలలు .. భీకరంగా ఊగిన ఓడ .. చుట్టూ గాలి చేస్తున్న భీకర శబ్దాలు.. అప్పటిదాకా షిప్ పైన ఉన్న వారు గదుల్లోకి పరిగెత్తారు. ఓ వైపు మైక్‌లో అనౌన్స్‌మెంట్లు.. మరో వైపు వెన్నులో మొదలైన వణుకు, ఈ ప్రయాణం అత్యంత భయానకం అని ఎందుకు అంటారంటే ఇందుకు చాలా కారణాలున్నాయి. దక్షిణ అమెరికాలోని చివరి అంచు నుంచి ప్రయాణం మొదలై అంటార్కిటా వద్ద ముగుస్తుంది. 620 మైళ్ల ఈ దూరాన్ని దాటడమంటే గుండెధైర్యం ఉండాల్సిందే. కేవలం థ్రిల్‌ కోసం చాలా మంది క్రూజ్‌ టూర్‌కి రెడీ అయిపోతారు. పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రంతో కలిపే ఈ మార్గాన్ని డ్రేక్ పాసేజ్‌ అంటారు. 1525లో కనుగొన్న ఈ మార్గానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గంగా గుర్తింపు ఉంది.

మరిన్ని వీడియోల కోసం

సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో

భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో

పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?

కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ