పనసకాయలు కోద్దామని చెట్టెక్కిన అతనికి ఊహించని షాక్..దెబ్బకు..
పెరట్లో పండినదానికంటే.. పక్కింటివాడి తోటలో కొట్టేసిన పనసకాయ రుచి ఎక్కువ అని... కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలా ఓ వ్యక్తి పనసకాయలు దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. ఎవరూ లేని సమయం చూసి ఓ చోట పనసచెట్టు నిండా కాయలు కనిపించడంతో క్షణం ఆలోచించకుండా చెట్టెక్కేశాడు. రెండు పనసకాయలు కోసాడు. మరికొన్ని కాయలు కోద్దామని ప్రయత్నిస్తున్న అతనికి ఊహించని షాక్ తగిలింది. దెబ్బకు గజగజా వణుకుతూ చెట్టుపై నానా అవస్తలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తుండగా ఓ తోటలో చెట్టునిండా పనసకాయలు కనిపించాయి. చట్టూ పరిశీలించాడు.
ఎవరూ కనిపించలేదు. అంతే.. ఈ పనసకాయలను ఓ పట్టు పట్టాల్సిందే అనుకున్నాడు. క్షణం ఆలోచించకుండా చెట్టెక్కేశాడు. చకచకా రెండు పనసకాయలు కోసాడు. మరికొన్ని కాయలు కోద్దామని ప్రయత్నిస్తుండగా ఊహించని షాక్ తగిలిందతనికి. ఎక్కడినుంచి వచ్చిందోకానీ.. ఓ పెద్దనాగుపాము వేగంగా చెట్టుపైకి వెళ్లి పనసకాయలు కోస్తున్న అతని కాళ్లను చుట్టేసింది. ఊహించని ఈ పరిణామానికి అతను గజగజా వణికిపోయాడు. ఆ పాము ఎక్కడ తనను కాటేస్తుందోనని భయపడ్డాడు. ఆ పామునుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే ఆ పాము అతన్ని వదల్లేదు. ఈ వీడియో ఇంతవరకే ఉండటంతో.. తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పాతదే అయినా మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దొంగకి.. పాము బాగా బుద్ధి చెప్పిందని కొందరు, పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే ఉంటుందని కొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియోను దాదాపు 7 లక్షలమందికి పైగా వీక్షించారు. 5 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం
సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
