AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

Samatha J

|

Updated on: Apr 09, 2025 | 6:58 PM

ఈమధ్యకాలంలో చిరుతలు జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతో ఊళ్లలోకి వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఆలయాలు, ఇళ్ల ప్రాంగణాల్లో సంచరిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే బెంగళూరులో ఓ చిరుత ఏకంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి మూలన నక్కింది. దానిని చూసి ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఆ ఇంటివారు.

 దానికి మత్తుమందు ఇచ్చి అటవీ అధికారులు బంధించి తీసుకెళ్లారు. ఇప్పడు శ్రీశైలంలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అర్ధరాత్రి రెండు చిరుతలు ఓ కాలనీలో సంచరించాయి. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీశైలం మండలం సున్నిపెంట ఏపీ జెన్కో కాలనీలోకి ప్రవేశించే గేట్ నెంబర్ 2 దగ్గర అర్ధరాత్రి చిరుత పులులు సంచరిస్తూ కనిపించాయి. చిరుతలు ఎంతో దర్జాగా తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాలనీలోకి వెళ్లేందుకు ఆ చిరుతలు అక్కడ ఉన్న పెద్ద గేటులోంచి లోపలికి దూరేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే గ్రిల్‌ చిన్నగా ఉండటంతో వాటికి లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు. సీసీ పుటేజీని పరిశీలించిన అటవీశాఖ అధికారులు స్థానికులను అలర్ట్‌ చేశారు. చిరుతలు సంచరిస్తున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లరాదని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం 

ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?

తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో

పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో

బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో