Hyderabad: కంపెనీలకు తెలంగాణ అడ్డాగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. రానున్న కాలంలో లక్షల్లో కొలువులు..

KTR: ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చే పదేళ్ల కాలంలో 16 లక్షల కొత్త కొలువుల(New Jobs) కల్పనే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి తోడు ఏటా రూ.2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు.

Hyderabad: కంపెనీలకు తెలంగాణ అడ్డాగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. రానున్న కాలంలో లక్షల్లో కొలువులు..
Ktr
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 03, 2022 | 3:12 PM

KTR: ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చే పదేళ్ల కాలంలో 16 లక్షల కొత్త కొలువుల(New Jobs) కల్పనే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి తోడు ఏటా రూ.2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈ-సిటీలో  రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను(Electric Manufacturing unit) మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమలకు తెలంగాణ అడ్డాగా మారిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితిలు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని వెల్లడించారు.

ప్రతి 14 సెకన్లకు ఒక టీవీ తయారు చేసే సామర్థ్యంతో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ రేడియంట్‌(Radiant electronics) తన రెండో యూనిట్‌ను ప్రారంభించింది. దీనితో దేశంలో 25 శాతం టెలివిజన్లు హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయి. ఇప్పటివరకు ఉన్న యూనిట్‌ ద్వారా ఏడాదికి 21 లక్షల టెలివిజన్ల తయారీ సామర్థ్యం ఉన్న రేడియంట్‌ సంస్థ.. కొత్త యూనిట్‌ ప్రారంభించడం ద్వారా ఏడాదికి 45 లక్షల టీవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది. శ్యాంసంగ్‌, వన్‌ప్లస్‌, పానసోనిక్‌, అమెజాన్‌, స్కైవర్త్‌, నోకియా, మోటరోలా తదితర ప్రఖ్యాత కంపెనీలకు చెందిన ఉత్పత్తులను రేడియంట్‌ తయారు చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసే వారిలో 50 శాతం మహిళలు, స్థానికులు ఉన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ముందుందన్నారు.

షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కొత్తూరు మండ‌ల ప‌రిధిలోని పెంజ‌ర్ల గ్రామంలో పీ అండ్ జీ లిక్విడ్ డిట‌ర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.200 కోట్లకు పైగా విలువైన కంపెనీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బిజినెస్​ చేయడం చాలా ఈజీ కాబట్టే మా ప్లాంటు కోసం కొత్తూరును ఎంచుకున్నట్లు కంపెనీ ఇండియన్​ సబ్​కాంటినెంట్​ సీఈఓ మధుసూదన్​ గోపాలన్​ అన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్​ పాలసీలు బాగుందని కొనియాడారు. మౌలిక సదుపాయాలు తమను ఆకట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్లాంటుతోపాటు ప్లానింగ్​ సర్వీస్​ సెంటర్​ను, టెక్నాలజీ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్ తమ కంపెనీకి చాలా కీలకమైనదని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

Parag Agarwal: ట్విట్టర్ లో మార్పులు.. భారత సంతతి సీఈవోను తొలగించనున్న ఎలాన్ మస్క్.. ఎందుకంటే..

Bank of Baroda: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్‌న్యూస్‌..!