Bank of Baroda: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్..!
Bank of Baroda: కారు కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్తే. కొత్త కారు కొనాలనుకునేవారికి బ్యాంకులు ఎన్నో ఆఫర్లు కల్పిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజుల నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు వరకు..
Bank of Baroda: కారు కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్తే. కొత్త కారు కొనాలనుకునేవారికి బ్యాంకులు ఎన్నో ఆఫర్లు కల్పిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజుల నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు వరకు మంచి ఆఫర్ల (Offers)ను అందిస్తున్నాయి. ఇక తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా అలాంటి ఆఫర్లనే అందిస్తోంది. కారు రుణాల (Car loans) పై వడ్డీ రేటును తగ్గించాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కారు రుణాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. ఇప్పుడు కొత్త వడ్డీ రేటు సంవత్సరానికి 7.25 శాతంగా మారింది. వడ్డీ రేటును తగ్గించడమే కాకుండా, జూన్ 30, 2022 వరకు పరిమిత కాలానికి లోన్ ప్రాసెసింగ్ ఫీజును రూ. 1500కి తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది. అయితే జీఎస్టీని ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఈ వడ్డీ రేటు, రాయితీ ప్రాసెసింగ్ రుసుము ప్రయోజనాలు కొత్త కారు కొనుగోలుపై మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ వడ్డీ రేటు కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్‌కి లింక్ చేయబడుతుంది.
బ్యాంక్ జనరల్ మేనేజర్ హెచ్‌టి సోలంకి మాట్లాడుతూ.. కారు రుణాలపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపుతో, కస్టమర్‌లు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సరసమైనది. అయితే, సెకండ్ హ్యాండ్ కార్లు, ద్విచక్ర వాహనాల రుణాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గృహ రుణాలపై వడ్డీ రేటును 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గించింది.
గృహ రుణంపై వడ్డీ రేటు 6.50 శాతానికి తగ్గింది:
బ్యాంక్ ఆఫ్ బరోడా గత నెలలో పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 6.75 శాతం నుండి 6.50 శాతానికి తగ్గించింది. వడ్డీ రేట్లు రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌కు లింక్ చేయబడ్డాయి. ఈ పథకం 30 జూన్ 2022 వరకు వర్తిస్తుంది. బ్యాంకు జనరల్ మేనేజర్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని నెలలుగా ఇళ్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగాయని, అందుకే వడ్డీ రేటును తగ్గించామని చెప్పారు
771 కంటే ఎక్కువ CIBIL స్కోర్‌లు ఉన్నవారికి ప్రయోజనం:
కొత్త హోమ్ లోన్, ఇతర రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు కొత్త రేటు అందుబాటులో ఉంది. 771.. అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్‌తో అన్ని రకాల రుణాలు అందుబాటులో ఉంటుంది. రుణదాతలు కొంతమంది రుణగ్రహీతలకు మార్చి 31, 2022 వరకు 6.5 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నారు. బ్యాంక్ ఏప్రిల్ 1, 2022 నుండి వడ్డీ రేటును 6.75 శాతానికి పెంచింది. ఇప్పుడు దానిని మళ్లీ తగ్గించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: