Trisha Krishnan: విజయ్‌తో కలిసి పెళ్లికి ఎందుకు వెళ్లారు.. ? త్రిష ఆన్సర్ ఇదే..
భారతీయ సినిమా ప్రపంచంలో దాదాపు 2 దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో కుర్ర భామలకు చెమటలు పట్టిస్తుంది. అలాగే అటు పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా గత వారం పది రోజులుగా ఆమె పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అసలు విషయానికి వస్తే..

దక్షిణాది సినిమా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. చెక్కు చెదరని అందం.. కట్టిపడేసే నటనతో వరుస అవకాశాలతో బిజీగా ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే ఆమె తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె నటించిన తమిళ చిత్రం కరుప్పు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి ఆర్జే దర్శకత్వం వహించగా.. బాలాజీ, సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా విజయ్, సంగీత విడాకుల వివాదంలో త్రిష పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..
ముఖ్యంగా విజయ్, త్రిష మధ్య సమ్ థింగ్ ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత సురేష్ కల్పతిల్ కొడుకు వివాహానికి త్రిష, విజయ్ ఇద్దరు కలిసి ఒకే రంగు దుస్తులలో ఒకే కారులో హాజరయ్యారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు మధ్య సమ్ థింగ్ అనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే మార్చి 13, 2026న, త్రిష కృష్ణన్ చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
దీంతో ఆమె చుట్టూ చేరుకున్న విలేకరులు విజయ్ గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా ఓ విలేకరి విజయ్ తో కలిసి ఒకే కారులో పెళ్లికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా.. త్రిష మౌనంగా వెళ్లిపోయింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో కొందరు త్రిషకు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్..
Question regarding attending a wedding event together with Vijay… Actress Trisha declines to answer.#Vijay #Trisha #MarriageEvent #AGS #TVKVijay #TrishaKrishnan pic.twitter.com/j3NGnrq2X2
— Balaji (@_balajihere) March 13, 2026
ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..
