AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ స్టవ్ Vs ఇండక్షన్ స్టవ్.. వంటకు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

Gas Stove Vs Induction Stove: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంటగదిలో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి అందుబాటులో ఉన్నప్పటికీ, నగరాల్లో నివసించే వారికి మాత్రం ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఏకైక ఆశాదీపంగా కనిపిస్తోంది. అసలు ఈ రెండిటిలో ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 13, 2026 | 7:46 PM

Share
వేగంలో ఇండక్షన్ టాప్:  వంట గ్యాస్ కంటే ఇండక్షన్ స్టవ్‌పై వంట వేగంగా పూర్తవుతుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాల రా నేరుగా పాత్రను వేడి చేస్తుంది. పాలు వేడి చేయడం లేదా నీటిని మరిగించడం వంటి పనులు నిమిషాల్లో అయిపోతాయి. గ్యాస్ ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు.

1 / 5
సేఫ్టీయే ఫస్ట్ ప్రాధాన్యత: ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నవారికి ఇండక్షన్ స్టవ్ అత్యంత సురక్షితం. దీనివల్ల గ్యాస్ లీకేజీ భయం ఉండదు, స్టవ్ ఆన్ చేసినా పాత్ర పెడితేనే వేడెక్కుతుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫీచర్ వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. మంట బయటకు రాదు కాబట్టి చుట్టుపక్కల ఉపరితలం వేడెక్కదు.

2 / 5
ఉష్ణోగ్రత నియంత్రణ: గ్యాస్ స్టవ్‌లో మంటను అంచనా వేయడం కష్టం. కానీ ఇండక్షన్ స్టవ్‌లో డిజిటల్ సెన్సార్ల ద్వారా ఖచ్చితమైన ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. తక్కువ వేడి మీద ఉడికించాల్సిన వంటకాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

3 / 5
క్లీనింగ్ చాలా ఈజీ:  గ్యాస్ స్టవ్ బర్నర్లు, స్టాండ్లు క్లీన్ చేయడం ఒక పెద్ద టాస్క్. కానీ ఇండక్షన్ స్టవ్ ఫ్లాట్ సర్ఫేస్‌ను ఒక తడి గుడ్డతో తుడిస్తే చాలు, నిమిషాల్లో మెరిసిపోతుంది. పైగా దీన్ని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. కావాల్సిందల్లా ఒక ప్లగ్ పాయింట్ మాత్రమే..

4 / 5
ధర విషయానికి వస్తే గ్యాస్ కంటే విద్యుత్ ఖర్చు కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రస్తుత సిలిండర్ల కొరత సమయంలో ఇండక్షన్ స్టవ్ ఒక గొప్ప ఉపశమనం అని చెప్పవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక మోడల్స్‌ను ఎంచుకోవడం ద్వారా కరెంట్ బిల్లును కూడా ఆదా చేసుకోవచ్చు.

5 / 5
Follow Us