AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Blessings: రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి ధన యోగాలు, కెరీర్‌లో పురోగతి

Sun Transit in Pisces from March 14: గ్రహరాజు రవి మార్చి 14 నుంచి మీన రాశిలో సంచారం చేయడం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో పురోగతి, ధనయోగాలు, విజయాలు లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 వరకు ఈ సంచారం అనేక శుభ ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి.

Sun Blessings: రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి ధన యోగాలు, కెరీర్‌లో పురోగతి
Sun Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 7:33 PM

Share

ఎవరినైనా, ఏ రంగంలో అయినా రాజును, రారాజును చేయగల సత్తా గ్రహ రాజు రవికి మాత్రమే ఉంది. ఏ రాశివారైనప్పటికీ నిత్యం ఆదిత్య హృదయం లేదా సూర్య స్తోత్రం పఠించడం వల్ల రవి వారిని తమ రంగంలో పైకి తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల (మార్చి) 14న తనకు అత్యంత అనుకూల స్థానమైన మీన రాశిలో రవి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనేక రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కెరీర్ పరమైన పురోగతి, ఆర్థిక పురోగతి, ధన యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. రవి ఏప్రిల్ 14 వరకూ ఇదే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

  1. వృషభం: ఈ రాశికి 11వ స్థానంలోకి రవి గ్రహం ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. సామాజికంగా కూడా హోదా వృద్ధి చెందుతుంది. రాజకీ యంగా, ప్రభుత్వ పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడ తాయి. తప్పకుండా వాహన యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఓ వెలుగు వెలిగే అవ కాశముంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే హోదాపరంగా, జీతభత్యాల పరంగా మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలు సాదిస్తారు. మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశముంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. విదేశీయానానికి అవకాశముంది. సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి.

Follow Us