గ్రీన్ టీ, బ్లాక్ టీ కంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్.. తెలిస్తే రెగ్యులర్గా తాగుతారు!
Jyothi Gadda
17 october 2026
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో బ్లూ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి ఉదర సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది.
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో బ్లూ టీ ఎంతో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ బాధితులకు ఒక మంచి హెల్దీ డ్రింక్గా మారుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో బ్లూ టీ ఎంతో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ బాధితులకు ఒక మంచి హెల్దీ డ్రింక్గా మారుతుంది.
ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మెదడు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. రాత్రి సమయంలో దీన్ని తాగితే చక్కటి నిద్ర పడుతుంది.
శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గాలనుకునేవారికి బ్లూ టీ అద్భుతమైన ఎంపిక. ఇది జీవక్రియను వేగవంతం చేసి అధిక బరువును తగ్గిస్తుంది.
గ్రీన్ టీ లో కెఫిన్ కొంత ఎక్కువగా ఉంటుంది, కానీ బ్లూ టీ లో కెఫిన్ ఉండదు కాబట్టి ఎవరైనా దీన్ని సురక్షితంగా త్రాగవచ్చు.
రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక కప్పు బ్లూ టీ తాగడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.