AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: డిసెంబర్ కల్లా వీరు జీవితంలో వెలుగు ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరిలోపు కొన్ని రాశులవారికి మిత్రులు, పరిచయాల ద్వారా జీవితంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు, కీలక వ్యక్తుల సహకారంతో ఉన్నత స్థితికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి కుంభం వరకు ఏ 6 రాశులవారికి ఈ అదృష్టం కలగనుందో తెలుసుకుందాం.

Astrology: డిసెంబర్ కల్లా వీరు జీవితంలో వెలుగు ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Life Progress
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2026 | 4:38 PM

Share

కొన్ని రాశులవారికి మిత్రులు, పరిచయాల ద్వారా క్రమంగా జీవితంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను బట్టి మరి కొద్ది రోజుల్లోనే వీరు శీఘ్ర పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతిషశాస్త్రంలో లాభ స్థానాన్ని బట్టి, అంటే 11వ స్థానాన్ని బట్టి, మిత్రులు, పరిచయాల ద్వారా జీవితంలో పురోగతి గురించి చెప్పడం జరుగుతుంది. మంచి పరిచయాలు కలిగే పక్షంలో అవి పురోగతికి మార్గాన్ని సుగమం చేసి, జీవితాలను ఉన్నత స్థితికి తీసుకు వెడతాయి. ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి డిసెంబర్ లోపల మంచి పరిచయాలు కలిగి, ఉన్నత స్థితికి వెళ్లడం జరుగుతుంది.

మేష రాశి

ఈ రాశికి లాభ స్థానంలో రాహువు బలమైన సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారు సంపన్న మిత్రుల సహాయంతో ఉద్యోగంతో పాటు వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. విదేశీ సంబంధ మైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి కొందరి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూసుకుపోయే తత్వం కలిగిన ఈ రాశివారు ఈ పరిచయాల ద్వారా అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉంది. శీఘ్ర పురోగతి ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశికి లాభ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారికి అధికారులు, సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం పుష్క లంగా అందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో బాగా పట్టూ, పలుకు బడి కలిగిన వ్యక్తులతో స్నేహాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత పురోగతికి చేయూత లభిస్తుంది. అంతేకాక, ప్రముఖులతో స్నేహాలు వృత్తి, వ్యాపారాలకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి

ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల తప్పకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వారి వల్ల వృత్తి, వ్యాపారాలు నిల దొక్కుకుని, అభివృద్ధి చెందడంతో పాటు, అంచనాలకు మించిన లాభాలు గడిస్తాయి. అధికా రులతో సాన్నిహిత్యం వల్ల ఉద్యోగ జీవితంలో పదోన్నతులతో పాటు, భారీ జీతభత్యాలు లభిం చడం జరుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. శీఘ్రగతిన పురోగతి చెందే అవకాశం ఉంది.

తుల రాశి

ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన రవి ప్రస్తుతం ఇదే రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో కలిసి ఉండడం, వచ్చే నెల 17 నుంచి ధన స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి పాలకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పరిచయాల ద్వారా విశేషమైన అదృష్టం పడుతుంది. విభిన్న వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాల వల్ల ఆదాయమూ పెరుగుతుంది. అధికారమూ బాగా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు రాశి

ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు జనవరి 2 వరకు లాభ స్థానంలోనే కొనసాగుతు న్నందువల్ల అన్ని వైపుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఎటువంటి సహా యానికైనా సిద్ధపడే మంచి పరిచయాలు కలుగుతాయి. అనేక వర్గాలకు చెందినవారితో పరిచ యాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగడానికి, ఆదాయం వృద్ది చెందడానికి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తికి దోహదం చేస్తాయి.

కుంభ రాశి

ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన గురువు ఈ నెలాఖరు నుంచి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక కొత్త లాభదాయక పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సంపన్నులు, వ్యాపారాలతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఉన్నతస్థాయి అధికారు లతో, రాజకీయ ప్రముఖులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పడడం వల్ల ఆదాయ మార్గాలు పెర గడం, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందడం జరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండ లభిస్తుంది.

Follow Us