AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఈ నటుడు సుమారు మూడు దశాబ్దాల పాటు తన నటనతో అలరించారు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఈ నటుడు చివరి రోజులు మాత్రం చాలా దయనీయంగా గడిచాయి.

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..
Narra Venkateswara Rao
Basha Shek
|

Updated on: Mar 13, 2026 | 7:53 PM

Share

నర్రా వెంకటేశ్వరరావు.. ఇప్పటి జనరేషన్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 80-90 జనరేషన్ కు ఈ యాక్టర్ ను చూస్తే ఇట్టే గుర్తు పడతారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా అగ్రహారంలో 1947లో నర్రా జన్మించారు. 1974లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుమారు 30 ఏళ్ల పాటు విలన్ గా, సహాయక నటుడిగా దాదాపు 500 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి, లక్ష్మీ నరసింహ తదతర సూపర్ హిట్ సినిమాల్లో నర్రా పోషించిన పాత్రలు తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మంచి ఆర్టిస్టుగానే కాక తెలుగు సినిమా పరిశ్రమలో వివాదరహితుడుగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా మెప్పించిన నర్రా జీవిత చరమాంకంలో మాత్రం చాలా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చావును ముందే గ్రహించిన ఆయన చంటి పిల్లాడిలా ఏడ్చేశాడు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన నర్రా వెంకటేశ్వర రావు 2009 డిసెంబర్‌ 27న క్యాన్సర్‌తో కన్నుమూశారు. తాజాగా నటుడి ఫ్యామిలీ ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా నర్రా కూతురు వాసంతి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘ నాన్నకు క్యాన్సర్‌ చాలా ఆలస్యంగా బయటపడింది. ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్‌ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయించాం. డాక్టర్లు పెద్ద పేగు క్యాన్సర్‌ ఉందని తేల్చి చెప్పారు. అది కూడా చివరి స్టేజ్‌ అని చెప్పి కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని షాకింగ్ న్యూస్ చెప్పారు. మేం నాన్నను బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. కీమోథెరపీ, సర్జరీలు చేయించడం వల్ల నాన్న నాలుగేళ్లు బతికారు. కానీ క్యాన్సర్‌ వల్ల దాదాపు 25 కిలోలు బరువు తగ్గిపోయారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన పవిత్ర బంధం అని సీరియల్ చేశారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంట్లో ఓపిక లేక షూటింగ్‌కు వెళ్లలేదు. మనవలు, మనవరాళ్లతో ఎంజాయ్‌ చేయాలనుకున్న సమయంలో ఇలా ఆరోగ్యం దెబ్బతినేసరికి నాన్న బాగా క్రుంగిపోయాడు. ఇంకేమైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? కనుక్కున్నారా? అని తరచూ అడిగేవారు. మరోపక్క తనకు ఏదైనా జరగరానిది జరిగినా నిన్ను పిల్లలు చూసుకుంటారు అని అమ్మకు ధైర్యం చెప్పేవారు. ఇక ఆయన చావుకు దగ్గరైనప్పుడు మాత్రం చిన్నపిల్లాడిలా ఏడ్చారు. నాన్న చాలా ధైర్యవంతుడు. కానీ చివరి రోజుల్లో ఆయన్ను అలా చూడలేకపోయాం’ అని నర్రా కూతురు ఎమోషనలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us