AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

తనతో పాటు తన కుటుంబ సభ్యులను పెట్రోల్ పోసి తగబెడతానన్న రౌడీ షీటర్ భర్త బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.

Andhra News: చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Andhra News
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 8:30 PM

Share

తెనాలి మండలం కొలకలూరికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర ఎనిమిదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత గ్రామంలో జులాయిగా తిరుగుతూ పలు నేరాల్లో పాల్గొనడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతనిపై రౌడీ షీట్ ఓపెన్ అయింది. వివాహం చేసుకున్న తర్వాతే ఒక హత్య కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. అతని ప్రవర్తన శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉండటంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. అంతేకాకుండా మరోసారి నేరాల్లో పాల్గొన వద్దని హెచ్చరిక జారీ చేశారు.

గతంలో తెనాలి పట్టణంలో వరుసగా రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడుతుండటంతో వారిలో మార్పు తీసుకొచ్చేందుకు బైండోవర్ రాయించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ లో తెనాలి తహశీల్దారు గోపాల క్రిష్ణ ఐదు లక్షల రూపాయల పూచీకత్తుతో బైండోవర్ రాయించారు. రౌడీయిజాన్ని రూపుమాపటానికి ఏకంగా రెవిన్యూ ఉద్యోగులు రంగంలోకి దిగి బైండోవర్ రాయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత రాజేంద్రలో మార్పు వస్తుందని అందరూ భావించారు. జైలు నుండి విడుదలయిన తర్వాత మూడు నెలల కాలం పాటు భార్య వేచి చూసింది. అయినప్పటికీ రాజేంద్రలో ఎటువంటి మార్పు రాలేదు. సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో విసిగిపోయిన రాజేంద్ర భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడాన్ని రాజేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఒక వైపు చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే భార్యను తన వద్దకు రావాలంటూ ఒత్తిడి చేశాడు. అయితే భార్య రాజేంద్ర మాటను పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రాజేంద్ర తన భార్యతో పాటు వారి బంధువులపై పెట్రోల్ పోసి తగులపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. రాజేంద్ర మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తెనాలి పోలీసులను ఆశ్రయించింది.తనతో పాటు తన బంధువులను పెట్రోల్ పోసి తగులపెడతానంటూ రాజేంద్ర బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేంద్రను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమిక ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట నిలబెట్టారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అయితే గతంలో రాజేంద్ర ఐదు లక్షల రూపాయల పూచికత్తుతో బైండోవర్ చేయడంతో ఆ మొత్తాన్ని అతని ఆస్తి నుండి వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us