AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే అన్నీ సేవలు.. యాప్ నుంచే..

రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రం శుభవార్త తెలిపింది. రేషన్ కార్డు సేవలను మొబైల్ ఫోన్ నుంచే పొందేందుకు ఉమాంగ్ యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇంటి వద్ద నుంచే రేషన్ సేవలు పొందవచ్చు. దరఖాస్తు దగ్గర నుంచి అన్నీ సేవలు పొందొచ్చు.

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే అన్నీ సేవలు.. యాప్ నుంచే..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 8:18 PM

Share

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేషన్ సేవలను డిజిటలైజ్ చేసింది. ఇక నుంచి యాప్ ద్వారానే రేషన్‌కు సంబంధించి సేవలన్నీ దేశ ప్రజలు పొందవచ్చు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి మీరు ఎంత రేషన్ తీసుకున్నారనే విషయం వరకు ప్రతీది ఇంటి వద్దనే చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడంతో పాటు దాని స్టేటస్ తెలుసుకునేందుకు మీరు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇక మీ రేషన్ కోటా ఎంత ఉంది..? ఇప్పటివరకు ఎంత తీసుకున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు రేషన్ షాపు వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే ఇంటి వద్ద అన్నీ విషయాలు చిటికెలో తెలుసుకోవచ్చన్నమాట.

ఉమాంగ్ యాప్‌లో మేరా రేషన్

ఉమాంగ్ యాప్‌లో కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇంట్లో కూర్చోని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి మీకు ఎంత రేషన్ వచ్చింది..? ఇప్పటివరకు ఎంత రేషన్ తీసుకున్నారు? అనే విషయాలను ఇందులోనే తెలుసుకోవచ్చు. మీ రేషన్ కార్డుకు సంబంధించిన సమగ్ర వివరాలు అన్నీ ఈ ఫీచర్ ద్వారా ఒకేచోట యాక్సెస్ చేయవచ్చు. రేషన్ కార్డు అనేది దేశంలో నివసించే పేదలకు అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతీ నెలా ఇంట్లోకి అవసరమయ్యే రేషన్ సరుకులు ప్రభుత్వం నుంచి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. తక్కువ ధరకే దుకాణాల ద్వారా సబ్సిడీపై నిత్యావసర సరుకులు పొందవచ్చు.

‘మేరా రేషన్ ఫీచర్’ ప్రయోజనాలు

-రేషన్ వినియోగాన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు

-ఒక కుటుంబానికి నెలకు ఎంత రేషన్ అందిందనే సమాచారం యాక్సెస్ చేయవచ్చు

-ఇప్పటివరకు ఎంత రేషన్ అందుకున్నారే వివరాలు తెలుసుకోవచ్చు

-మీ రేషన్ వాటా తగ్గుతుందోలేదో అర్థం చేసుకోవచ్చు

-వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు సమీపంలోని రేషన్ దుకాణాలను గుర్తించవచ్చు

-గత రేషన్ లావాదేవీల హిస్టరీని వీక్షించవచ్చు

-సమీపంలోని రేషన్ దుకాణాల అడ్రస్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పొందవచ్చు

ఫీచర్ ఎలా వాడాలంటే..?

-ఉమాంగ్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోండి

-మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి

-4 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోండి

-హోమ్ పేజీలో సెర్చ్ బాక్స్‌లో మేరా రేషన్ అని టైప్ చేయండి

-రేషన్ కార్డు సేవలపై క్లిక్ చేయండి

-రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి

-రేషన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు

Follow Us
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!