AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..

పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. అస్సోంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. దీంతో రైతులందరికీ అకౌంట్లోకి రూ.2 వేలు జమ అయ్యాయి. రైతులు ఎప్పటినుంచో ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
pm kisan
Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 5:47 PM

Share

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త అందించింది. 22వ విడత నిధులను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అస్సోంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో మోదీ బటన్ నొక్కి నిధులను రిలీజ్ చేశారు. దీంతో ఒక్కొక్క లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల జమ అయ్యాయి. ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ నిధులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 93.2 మిలియన్లకుపైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.18,640 కోట్లకుపైగా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతులకు రూ.4.27 లక్షల కోట్లను ప్రభుత్వం అందించింది.

ఇవి పూర్తి చేసి ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు

పీఎం కిసాన్ లబ్దిదారులు నగుదును అందుకోవాలంటే తప్పనిసరగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ప్రభుత్వ పత్రాలతో భూమి రికార్డులను నమోదు చేసి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండి ఉండాలి. ల్యాండ్ రికార్డుల సమస్యలు ఉండకూడదు. ఓటీపీ, నోటిఫికేషన్ల కోసం మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేసుకుని ఉండాలి. దీంతో మీ బ్యాంక్ అకౌంట్లో పీఎం కిసాన్ నిధులు పడగానే మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. దీని వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో.. లేదో తెలిసిపోతుంది.

డబ్బులు పడ్డాయో.. లేదో చూసుకోవచ్చు..

-మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో.. లేదో స్టేటస్ చేసుకోవచ్చు

-ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లండి

-హోమ్ పేజీలో Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఆ తర్వాత ఇనాస్టాల్‌మెంట్ డీటైల్స్‌లో 22వ విడత సెలక్ట్ చేసుకోండి

-అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్‌తో పాటు మీకు డబ్బులు పడ్డాయో.. లేదో స్టేటస్ తెలుస్తుంది

మీ పేరు ఉందో.. లేదో చేసుకోండి

పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోండి. మీ పేరు ఉంటేనే అకౌంట్లలో నిధులు జమ అవుతాయి. ఇటీవల కొంతమంది అనర్హుల పేర్లను కేంద్రం తొలగించింది. దీంతో బెనిఫిషియరీ లిస్ట్ చేెక్ చేసుకోండి. అందులో మీ పేరు ఉండి కేవైసీ పూర్తి చేసి ఉంటే అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.

Follow Us
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే