Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parag Agarwal: ట్విట్టర్ లో మార్పులు.. భారత సంతతి సీఈవోను తొలగించనున్న ఎలాన్ మస్క్.. ఎందుకంటే..

Parag Agarwal: ట్విట్టర్‌ కంపెనీని 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. కొత్త సీఈవోను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే మరింత మంది కీలక ఉద్యోగులను మస్క్ తొలగిస్తారని తెలుస్తోంది.

Parag Agarwal: ట్విట్టర్ లో మార్పులు.. భారత సంతతి సీఈవోను తొలగించనున్న ఎలాన్ మస్క్.. ఎందుకంటే..
Elon Musk
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 03, 2022 | 2:40 PM

Parag Agarwal: ట్విట్టర్‌ కంపెనీని 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. కొత్త సీఈవోను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్విట్టర్‌ (Twitter) ఛైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌తో ఇటీవల భేటీ అయిన మస్క్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటార్స్‌ తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం యాజమాన్యంపై తనకు ఏమాత్రం విశ్వాసం లేదని ఎలాన్ మస్క్‌ తెలిపినట్లు కంపెనీలోని ఒక అధికారి తెలిపారు. గత సంవత్సరం నవంబర్ నెలలో పరాగ్ అగర్వాల్ సీఈవోగా ట్విట్టర్ బాధ్యతలు చేపట్టారు. అధికారికంగా కంపెనీని పూర్తి స్థాయిలో ఎలాన్ మస్క్(Elon Musk) కు అప్పగించేంత వరకూ ఈయనే సీఈవోగా కొనసాగనున్నారు.

కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఒకవేళ పరాగ్‌ను సీఈవో బాధ్యతల నుంచి 12 నెలల్లోగా తొలగించనట్లయితే.. 42 మిలియన్‌ డాలర్లును పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్‌ అసహనంగా ఉన్నారు. కచ్చితంగా పరిహారాలు, వేతనాల్లో కోత ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అయితే కొత్త సీఈవోగా ఎవరిని మస్క్ నియమిస్తున్నారన్న విషయం మాత్రం ఇంకా బహిర్గతం కాలేదు.

వీటికి తోడు ట్విట్టర్‌ లీగల్‌ హెడ్‌గా ఉన్న భారత సంతతి మహిళ విజయ గద్దె (Vijaya Gadde)ను సైతం మస్క్‌ తొలగిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ తొలగిస్తే కంపెనీ ఆమెకు 12.5 మిలియన్‌ డాలర్ల పరిహారంతో పాటు షేర్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ గద్దె కూడా ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్‌ స్వాతంత్య్రంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సమయంలో విజయ కంపెనీని గాడిన పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీకి ఎదురైన అనేక న్యాయపరమైన చిక్కులను చాకచక్యంగా పరిష్కరించటంలో ఆమెది కీలక పాత్రగా చెప్పుకోవాలి. కంపెనీని అమ్మేందుకు ముందు నిర్వహించిన బోర్డు మీటింగ్ లో సైతం విజయ కంపెనీ భవిష్యత్తుపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోపక్క ఒప్పందం ఖరారైన నాటి నుంచి ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవితవ్యం ఏంటని పరాగ్‌ను ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగ భద్రతపై నిలదీస్తున్నారు. అగర్వాల్ మాత్రం ఒప్పందం అధికారికంగా పూర్తయ్యే వరకు ఉద్యోగుల తొలగింపు ఉండదని హామీ ఇచ్చారు. దీని ప్రభావం కంపెనీ పనితీరుపై ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి..

Govt Doctor Jobs: సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్‌ సందర్శించే అవకాశం

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్