Viral News: 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం.. ఆరుగురు సంతానం.. సీన్‌ కట్ చేస్తే..

Viral News: సహజీవనం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం లీవింగ్ టు గెదర్‌ అనేది సాధారణంగా మారి ఉండొచ్చు. కానీ ఓ 15 ఏళ్ల క్రితం ఈ మాట వింటే వామ్మో అనే వారు...

Viral News: 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం.. ఆరుగురు సంతానం.. సీన్‌ కట్ చేస్తే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 03, 2022 | 2:48 PM

Viral News: సహజీవనం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం లీవింగ్ టు గెదర్‌ అనేది సాధారణంగా మారి ఉండొచ్చు. కానీ ఓ 15 ఏళ్ల క్రితం ఈ మాట వింటే వామ్మో అనే వారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ కాలంలోనే ఏకంగా ముగ్గురితో సహజీవనం చేసేశాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ ముగ్గురిని వివాహమాడాడు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య (42)15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. ఈయనకు ఆరుగురు సంతానం ఉన్నారు. కొన్నేళ్ల పాటు సహజీనం చేసిన శౌర్య తాజాగా ఆ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆరుగురు పిల్లల సమక్షంలో కావడం విశేషం. ఏప్రిల్‌ 30న ఒకే మండపంలో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మౌర్య తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం చేసుకునే వారు తమ తెగ వారు ఏ కార్యక్రమానికి అనుమతించలేదని చెప్పుకొచ్చాడు. అయితే మౌర్య వివాహానికి తాజాగా గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలి రావడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Heart Function: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!

IPL 2022: ఒక రైతు కొడుకు ఐపీఎల్‌లో కోట్లు సంపాదిస్తున్నాడు.. పేదరికంలో పెరిగిన మరో ‘విరాట్‌’..!

Realme Narzo 50A Prime: సరికొత్త రియల్‌మీ నార్జో 50A ప్రైమ్‌ ఫీచర్లు ఇవే