AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. యూత్ మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు సైతం ఈ సినిమాను చూసి ప్రశంసించారు. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అది కూడా రిపీట్ మోడ్ లో..

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. యూత్ మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 13, 2026 | 8:43 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 13) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతున్నాయి. అందులో ఒక చిన్న సినిమా కూడా ఉంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ అయితే ఎగబడి చూసేశారు. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక గత వారమే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది. అంతే.. థియేటర్లలో సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది. మూవీ లవర్స్ ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూసేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

పెళ్లి వయసుకు వచ్చిన ఓ అబ్బాయి, అమ్మాయి తిరిగి స్కూల్ డేస్ కు వెళ్లడం, పాఠశాల రోజుల్లో ప్రేమించిన వ్యక్తులను కలవాలనుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతోంది. ఇందులో హీరో సత్యకు వాస్తుపై మంచి పట్టు ఉంటుంది. అయితే అతనికి అరెంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ తన చెల్లి ఒత్తిడి మేరకు ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి మోనిష అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. అలా మొదలైన వారి ప్రయాణం.. ఎక్కడి దాకా చేరిందన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

విత్ లవ్ సినిమాపై రివ్యూ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us