AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదిలాబాద్ అన్నదాతకు అవే అక్షయ బంగారం.. వాటి కోసం దుకాణాల ముందు క్యూ

అక్షయ తృతీయ(Akshaya Tritiya) అనగానే ఠక్కున గుర్తొచ్చేది బంగారం కొనుగోళ్లు. అక్షయ తృతీయ వేళ గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆదివాసీల ఖిల్లా అయిన...

Telangana: ఆదిలాబాద్ అన్నదాతకు అవే అక్షయ బంగారం.. వాటి కోసం దుకాణాల ముందు క్యూ
Farmers
Ganesh Mudavath
|

Updated on: May 03, 2022 | 3:03 PM

Share

అక్షయ తృతీయ(Akshaya Tritiya) అనగానే ఠక్కున గుర్తొచ్చేది బంగారం కొనుగోళ్లు. అక్షయ తృతీయ వేళ గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆదివాసీల ఖిల్లా అయిన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో మాత్రం.. విత్తనాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిరుల పంట పండించే విత్తనాలనే తాము బంగారంగా బావించి, అక్షయ తృతీయ పర్వదినాన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఇవాళ కొనుగోలు చేసిన విత్తనాలను దేవుని గదిలో భద్రపరిచి, తొలకరి సమయంలో ప్రత్యేక పూజలు చేసి సాగుకు ఉపయోగిస్తామని వెల్లడించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకుంటూ తొలకరి జల్లు కోసం ఎదురు చూసే అన్నదాత ఈ అక్షయ తృతీయ పర్వదినాన తొలి విత్తనాన్ని కొనుగోలు చేయడం ఆదిలాబాద్ ప్రత్యేకం. ఆదిలాబాద్ పల్లెల్లో జరిగే ప్రతి పండుగకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్షయ తృతీయ పర్వదినం కూడా ఆదిలాబాద్ అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగే. అలా అని బంగారాన్ని బారులు తీరి కొనేయరు.. బంగారం కంటే విలువైన సిరుల పంటనిచ్చే విత్తనాలను క్యూ కట్టి మరీ కొంటారు.

గిరిజనులతో పాటు గిరిజనేతరులు పెద్ద ఎత్తున తరలి‌వచ్చి ఈరోజు విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. అప్పు చేయకుండా చేతిలో ఎంత ఉంటే అంత స్తోమతను‌ బట్టి అక్షయ తృతీయ వేళ విత్తన కొనుగోళ్లు జరుపుతారు. అక్షయ తృతీయ పండుగ సందర్బంగా ఆదిలాబాద్ లోని విత్తన దుకాణాలన్నీ రైతులతో సందండిగా కనిపించాయి. పంజాబ్ చౌక్ , అంబేడ్కర్ చౌక్ , సౌజన్య విత్తన మార్కెట్ రైతులతో‌ కళకళాడింది. ఉదయం నుండే పత్తి, సోయ, శనగ విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్ గ్రామీణ‌ ప్రాంతాల నుండి తరలి వచ్చిన అన్నదాతలు విత్తన దుకాణాలకు క్యూ కట్టారు.

– నరేష్ స్వేన, టీవీ9 తెలుగు, ఆదిలాబాద్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Viral News: 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం.. ఆరుగురు సంతానం.. సీన్‌ కట్ చేస్తే..

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ స్పాట్ ఫోటోస్.. నెట్టింట వైరల్