AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagga Reddy: హీరో రజినీకాంత్ స్టైల్‌లో ఉంది సీఎం కేసీఆర్ పాలన.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాహుల్ పర్యటన విజయవంతం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy: హీరో రజినీకాంత్ స్టైల్‌లో ఉంది సీఎం కేసీఆర్ పాలన.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Jagga Reddy
Balaraju Goud
|

Updated on: May 03, 2022 | 1:28 PM

Share

MLA Jagga Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శివాజీ సినిమాలో రజినీకాంత్ స్టైల్‌లో రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మాట్లాడే అభివృద్ధి నిజం కాదన్నారు. చారెడు పనికి బారెడు ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్ ను దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ , రైతు సంక్షేమం అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని… అసలు కేసీఆర్ వచ్చాకే కరెంట్ పుట్టినట్లు, రైతులు వ్యవసాయం చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తొలుత ఉచిత విద్యుత్ ప్రారంభించింది కాంగ్రెస్ సర్కారేనని పేర్కొన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు.

రాష్ట్రంలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాహుల్ ఓయూ పర్యటన, వరంగల్ సభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిని అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే రాహుల్ వస్తున్నారని తెలిపారు.

మరోవైపు, రాహుల్‌ గాంధీ పబ్‌ ఇష్యూపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఫంక్షన్ కి వెళ్లాడని.. పెళ్లి దగ్గర ఏముంది అనేది ఊహించడు కదా..? అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ.. బీజేపీ..టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఆ వీడియో లో ఏముంది..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారు అనేది మేము కెమెరా పెట్టాలా..? పెండ్లి దావతికి పోతే కూడా తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. బీజేపీ, టీఆరఎస్ నేతలు చిల్లర వ్యవహారం చేస్తున్నారని.. పబ్‌ కు రాహుల్‌ గాంధీ వెళితే.. తప్పేంటి అని నిలదీశారు జగ్గారెడ్డి.