దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
పసిడి ధర పరుగులు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర 95వేలకు చేరువైంది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యుడికి ముచ్చెమటలు పట్టించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైనట్లు కనిపిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టిన పుత్తడి ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా.. ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నా ట్రెండ్కు విరుద్ధంగా గోల్డ్ రేట్ మాత్రం తగ్గుతూ వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే తులం బంగారం 56వేలకు దిగొస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ పుత్తడి ధర ఎందుకు తగ్గుతోంది? నిజంగా తులం రేటు అంత తగ్గనుందా..?బంగారం బంగారమైపోయింది. ఇదీ.. నిన్నమొన్నటి వరకు వినిపించిన వార్త. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పెరగడమే తప్ప తరగడం తెలియదన్నట్లు పెరుగుతూపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే తులం బంగారం రేటు 3వేలకుపైగా పతనమైంది. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందన్న వార్తలు సామాన్యుడికి ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంచనాలు భారతీయులకు సంతోషాన్నిస్తున్నాయి. ఇంతకాలం పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిన జనం.. భవిష్యత్తులో అసలు బంగారం కొనగలమా అనే సందిగ్దంలో పడ్డారు. అయితే రానున్న రోజుల్లో పుత్తడి రేటు 40శాతం వరకు తగ్గొచ్చన్న అంచనాలు వారిలో కొత్త ఆశలు రేపుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర 17సార్లు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. మరికొన్ని రోజుల్లో తులం ధర అక్షరాలా లక్షకు చేరుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో చాలా మంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. నిజానికి బంగారానికి మించిన సురక్షితమైన పెట్టుబడి సాధనం మరొకటి లేదు. అందుకే భారతీయులందరి ఇళ్లలో కచ్చితంగా ఎంతో కొంత బంగారం ఉంది. 2025లో ఇప్పటివరకు అత్యధిక రిటర్నులు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది బంగారమే. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 15.72 శాతం వృద్ధి నమోదు చేసిన గోల్డ్.. ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ హవా కొనసాగించి సరికొత్త రికార్డులు సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం
గిన్నిస్ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో
శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో
అయ్యో.. ఈ కండక్టర్ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
