మీ ఆదాయపు పన్ను స్లాబ్‌లను తెలుసుకోండి
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Upto Rs 2,50,000 | Nil |
Rs 2,50,001 to Rs 3,00,000 | 5% |
Rs 3,00,001 to Rs Rs 5,00,000 | 5% |
Rs 5,00,001 to Rs 10,00,000 | 20% |
Above Rs 10,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Up to Rs. 3,00,000 | Nil |
Rs. 300,001 to Rs. 6,00,000 | 5% (Tax Rebate u/s 87A) |
Rs. 6,00,001 to Rs. 900,000 | 10% (Tax Rebate u/s 87A up to Rs 7 lakh) |
Rs. 9,00,001 to Rs. 12,00,000 | 15% |
Rs. 12,00,001 to Rs. 1500,000 | 20% |
Above Rs. 15,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Upto Rs 2,50,000 | Nil |
Rs 2,50,001 to Rs 3,00,000 | Nil |
Rs 3,00,001 to Rs Rs 5,00,000 | 5% |
Rs 5,00,001 to Rs 10,00,000 | 20% |
Above Rs 10,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Up to Rs. 3,00,000 | Nil |
Rs. 300,001 to Rs. 6,00,000 | 5% (Tax Rebate u/s 87A) |
Rs. 6,00,001 to Rs. 900,000 | 10% (Tax Rebate u/s 87A up to Rs 7 lakh) |
Rs. 9,00,001 to Rs. 12,00,000 | 15% |
Rs. 12,00,001 to Rs. 1500,000 | 20% |
Above Rs. 15,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Upto Rs 2,50,000 | Nil |
Rs 2,50,001 to Rs 3,00,000 | Nil |
Rs 3,00,001 to Rs Rs 5,00,000 | Nil |
Rs 5,00,001 to Rs 10,00,000 | 20% |
Above Rs 10,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
Up to Rs. 3,00,000 | Nil |
Rs. 300,001 to Rs. 6,00,000 | 5% (Tax Rebate u/s 87A) |
Rs. 6,00,001 to Rs. 900,000 | 10% (Tax Rebate u/s 87A up to Rs 7 lakh) |
Rs. 9,00,001 to Rs. 12,00,000 | 15% |
Rs. 12,00,001 to Rs. 1500,000 | 20% |
Above Rs. 15,00,000 | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
0-2.5 లక్షల రూపాయలు | 0% |
2.5-5 లక్షల వరకు ఉంటుంది | 5% |
5-10 లక్షల వరకు ఉంటుంది | 20% |
10 లక్షల పైన | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
0-3 లక్షల రూపాయలు | 0% |
3-7 లక్షల రూపాయలు | 5% |
7-10 లక్షల రూపాయలు | 10% |
10-12 లక్షల రూపాయలు | 15% |
12-15 లక్షల రూపాయలు | 20% |
15 లక్షల కంటే ఎక్కువ | 30% |
రంగాల వారీగా బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2024-25
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ ‘మినీ బడ్జెట్’ నుండి దేశప్రజలకు గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆశించారు. అయితే, మధ్యంతర బడ్జెట్ సాంప్రదాయం మేరకు కేంద్ర ప్రభుత్వం అలాంటి జనాకర్షక ప్రకటనలు ఏవీ ఈ మధ్యంతర బడ్జెట్‌లో చేయలేదు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఉపశమనం లభింకపోవడంతో పాటు పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆర్థిక మంత్రి 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో మోదీ ప్రభుత్వ పదేళ్ల విజయాలను గుర్తుచేస్తూ ‘జై హింద్’ నినాదంతో ముగించారు. హ్యాట్రిక్ విజయంతో మళ్లీ కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. త్వరలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ 2024-25ను సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. ఇందులో కొన్ని రంగాలకు ఊరట కలిగించే ప్రకటలనలు ఉండే అవకాశముంది. అటు వేతనజీవులు కూడా పన్ను స్లాబుల్లో మార్పులతో కాస్తైనా ఊరట కలిగిస్తారని ఆశిస్తున్నారు.
బడ్జెట్ 2024కి సంబంధించిన ఆసక్తికర ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న – పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ 2024-25ను ఎప్పుడు ప్రవేశపెడతారు?
జవాబు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జులై 22న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు.
ప్రశ్న – ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు – సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్న – పూర్తి బడ్జెట్లో ఏ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు?
జవాబు – ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సంక్షేమ రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా చర్యలు ఉంటాయా?
జవాబు – ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉంటాయా?
జవాబు – బడ్జెట్లో ఆటో మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు. ముఖ్యంగా EV అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా?
జవాబు – ఈసారి బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రశ్న – బడ్జెట్లో మొదటిసారిగా వేతన జీవులకు లబ్ధి చేకూర్చింది ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో 1974 బడ్జెట్లో మొదటిసారి స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న – బడ్జెట్కు ముందు హల్వా వేడుకను ఎందుకు జరుపుకుంటారు?
జవాబు – ఏదైనా శుభ కార్యం చేసే ముందు, ఏదైనా తీపి తినాలి.. అందుకే బడ్జెట్ వంటి పెద్ద కార్యక్రమాలకు ముందు ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం ఉంది.
ప్రశ్న – రైల్వే బడ్జెట్ను బడ్జెట్లో ఎప్పుడు విలీనం చేశారు?
జవాబు – 2016లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చివరి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికారు. రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు.
ప్రశ్న – కేంద్ర బడ్జెట్ 2023-24లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు చేశారు?
జవాబు – అత్యధికంగా రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్ల వ్యయ కేటాయింపులు చేశారు. ఇందులో మూలధన వ్యయం: రూ.2.01 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం: రూ.39,000 కోట్లు, సబ్సిడీలు: రూ.1,500 కోట్లు ఉంది.
ప్రశ్న- స్వతంత్ర భారత్లో తొలి కేంద్ర బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు – తొలి బడ్జెట్ను 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
ప్రశ్న- అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినవారు ఎవరు?
జవాబు – కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10సార్లు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న- ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు
జవాబు – నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఆరుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 జులై 22న ఏడోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్న – బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఎప్పుడు మార్చారు?
జవాబు – 2016 వరకు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజు సమర్పించే సాంప్రదాయం ఉండేది. 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఆ తేదీన బడ్జెట్ సమర్పిస్తున్నారు.
ప్రశ్న- బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.