బడ్జెట్ : పన్ను చెల్లింపుదారుల ఆశలను నిర్మలమ్మ నెరవేరుస్తుందా..?
samatha
31 January 2025
Credit: Instagram
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
దీంతో ఆదాయపన్ను చెల్లింపుదారులు బడ్జెట్ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. వారి ఆశలను ఈ సారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నెరవేరుస్తారా లేదా అని ఆశగా చూస్తున్నారు.
కాగా, పన్ను చెల్లింపుదారుల సమస్యలు ఏంటి, వారు బడ్జెట్‌లో ఎలాంటి లాభాలు చేకూరాలని కోరుకుంటున్నారో చూద్దాం.
ఆదాయపు పన్ను భారం తగ్గించడం లేదా ఆదాయాన్ని పెంచడానికి ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు పెంచడం. ముఖ్యంగా చెల్లింపుదారులు తమ పన్ను చెల్లింపులో అధిక శాతం తగ్గుదలకు ఎదురు చూస్తున్నారు.
IT చట్టంలోని సెక్షన్ 80Cని సవరిచడంతో పాటు, సెక్షన్ 80C మినహాయింపు పరిమితిని సవరించడం కోసం పన్ను చెల్లింపుదారులు ఎదురు చూస్తున్నారు.
సెక్షన్ 80C కింద హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌ల పరిమితిని పెంచాలని లేదా గృహరుణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక మినహాయింపును ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు.
ఆరోగ్య బీమా ప్రీమియం కోసం 80D పరిమితిని పెంచాలని పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
8. మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా, ఆదాయపు పన్ను రహితం చేయడానికి ప్రాథమిక మినహాయింపు పరిమితిలో పెరుగుదల కోసం వారు ఎదురు చూస్తున్నారు.