పవన్ కళ్యాణ్ సినిమాలకు నో చెప్పినా పూజా హెగ్దే..ఇప్పుడు ఆఫర్స్ లేక..

samatha 

30 January 2025

Credit: Instagram

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఈ మూవీతో పూజా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

మొదటి సినిమా ఫ్లాప్ అందుకున్నా, పూజాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో వరసగా ఆఫర్స్ రావడంతో అప్పట్లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా నార్త్ టు సౌత్ వరస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీకి , ఇప్పుడు టాలీవుడ్‌కు దూరమైందనే చెప్పాలి.

తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ చెక్కేసింది. కానీ అక్కడ కూడా చేసిన సినిమా ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ ఆఫర్స్ కరువు అయ్యాయంట.

కాగా, తాజాగా పూజాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. కానీ పూజా మాత్రం రెండు సార్లు అవకాశం వచ్చినా డేట్స్ ఖాళీలేక నో చెప్పిందంట.

పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో వకీల్ సాబ్ ఒకటి, ఇందులో నటించడానికి పూజాను మూవీ మేకర్స్ సంప్రదించగా బ్యూటీ మూవీకి నో చెప్పిందంట.

అలాగే, హరిహర వీరమల్లులో కూడా అవకాశం రాగా, డేట్స్ ఖాళీలేక రిజెక్ట్ చేసిందంట. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదని సమాచారం.