బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ అమ్మడు అందం గురించి ఎంత పొగిడినా అది తక్కువే అవుతుంది.
బాలకృష్ణ అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, అనతి కాలంలోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.
దీంతో మరోసారి బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసి ముచ్చటగా రెండోసారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తాజాగా తన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
లేత గులాబీ రంగు చీరలో, గోల్డ్ కలర్ బ్లౌజ్ ధరించి ఈ అమ్మడు తన అందాలతో కుర్రకారును మాయ చేస్తోందనే చెప్పాలి. ఇందులో ఈ బ్యూటీ అందం మరింత పెరిగింది.
లేత గులాబీ రంగు చీరలో బాలయ్య బ్యూటీ దేవకన్యలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ కావడంతో, వీటిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య బ్యూటీ లుక్ క్యూట్‌గా బ్యూటిఫుల్‌గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరేమో జై బాలయ్య.. ప్రగ్యా నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ అఖండ 2 సినిమా నుంచి తప్పకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.