Railway Budget-2025: ఈ బడ్జెట్‌లో రైల్వే కోసం కేంద్రం ఈ కీలక ప్రకటనలు చేయనుందా..?
Railway Budget-2025: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే బడ్జెట్‌పైనే అందరి చూపు. ఈ బడ్జెట్‌లో రైల్వేకు ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు..
ఫిబ్రవరి 1న సమర్పించనున్న బడ్జెట్‌లో రైల్వేలకు సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే బడ్జెట్‌ను పెంచే అవకాశం ఉంది. కనీసం 20% పెరిగే అవకాశం ఉంది. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే ప్రయాణికుల సౌకర్యాలను పెంచడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో భారీ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: PM Kisan: 19వ విడతకు ఏ రైతులు అర్హులు? మీరు జాబితాలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి!
కొత్త రైళ్ల ప్రకటనకు అవకాశం:
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైల్వేకు కేంద్ర ప్రభుత్వం రూ.2.62 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని రూ.3 లక్షల కోట్లకు పైగా పెంచవచ్చు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రైల్వే వందే భారత్ రైళ్లపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి అనేక కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందువల్ల కేంద్ర బడ్జెట్ 2025లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించేస్టేషన్ల పేర్లను కూడా ప్రకటించవచ్చు. రైల్వే ప్రయాణాన్ని సురక్షితంగా చేయడంపై కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం రైలు నెట్‌వర్క్‌లో కవాచ్ వ్యవస్థను అమలు చేయడానికి దాదాపు రూ.12,000 కోట్లు కేటాయించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించిన మరికొన్ని ప్రకటనలు కూడా బడ్జెట్‌లో వెల్లడించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్యాసింజర్ రైళ్ల సగటు వేగాన్ని పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వం గత కొంత కాలంగా రైల్వేలపై ఎన్నో పనులు చేస్తోంది. ఇందులో ప్రధానమైనది రైల్వేలను ఆధునీకరించడం. దీనితో పాటు ప్రయాణికుల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా పనులు కూడా జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ ఆమోదం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి