PM Kisan: 19వ విడతకు ఏ రైతులు అర్హులు? మీరు జాబితాలో ఉన్నారో లేదో చెక్‌ చేసుకోండి!

PM Kisan: మోదీ సర్కార్‌ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అందులో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ప్రతి ఏడాది రైతులకు రూ.6000 చొప్పున అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తోంది. విడతకు రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం..

PM Kisan: 19వ విడతకు ఏ రైతులు అర్హులు? మీరు జాబితాలో ఉన్నారో లేదో చెక్‌ చేసుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2025 | 6:06 PM

రైతులతో సహా సమాజంలోని పెద్ద వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద, అర్హులైన రైతులు సంవత్సరానికి మూడుసార్లు రూ.2,000 పొందుతారు. మీరు ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకం కింద అందించే 19వ విడతకు అర్హులు కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు 18వ విడత అందుకోగా, ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. మీరు తదుపరి చెల్లింపును అందుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి.

రైతులు ఇవి తప్పనిసరి చేయాల్సిందే?

మీరు పీఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్లయితే రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి.

ఇవి కూడా చదవండి
  1. E-KYC: పథకంలో నమోదు చేసుకున్న తర్వాత e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్‌స్టాల్‌మెంట్‌ అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో e-KYCని పూర్తి చేయవచ్చు లేదా మీ సమీప CSC కేంద్రాన్ని సందర్శించవచ్చు. అది కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు అయినా.. ఇది వరకు సాయం పొందుతున్న రైతులు అయినా ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి.
  2. భూమి ధృవీకరణ: రైతులు తమ భూమి సమాచారం అప్‌డేట్‌ చేసి ఉండాలి. మీరు ఈ దశను పూర్తి చేయకుంటే, వచ్చే నిధులలో జాజ్యం జరగవచ్చు. అన్ని భూమికి సంబంధించి అన్ని వివరాలు పూర్తి చేసి ఉండాలి.
  3. ఆధార్ లింకింగ్: మీ ఆధార్ కార్డ్‌ని మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం కూడా తప్పనిసరి. ఇన్‌స్టాల్‌మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి, లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
  4. ఇది పూర్తి చేయడం ద్వారా మీరు పీఎం కిసాన్ యోజన కోసం మీ అర్హతను చెల్లుబాటు అయ్యేలా చూసుకోవచ్చు. అలాగే రాబోయే 19వ విడతలో ఏవైనా సమస్యలు ఉంటే నివారించవచ్చు.

వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ వర్తించదు:

ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లింపుదారులు, వృత్తి నిపుణుల వంటి వారికి పీఎం కిసాన్ సాయం అందదని గుర్తించుకోండి. అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిగిస్తోంది. కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పీఎం కిసాన్ యోజన బెనిఫిట్ లభిస్తుంది. ఒక వేళ భార్యాభర్తలిద్దరిపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి