AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!

RBI: 200 నోట్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మార్కెట్లో నకిలీ 200 రూపాయల నోట్లు వస్తున్నాయని, నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది. కొందరు 200 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు..

RBI: రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
Subhash Goud
|

Updated on: Jan 16, 2025 | 2:52 PM

Share

ప్రస్తుతం రూ.2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 98 శాతంకుపైగా నోట్లు బ్యాంకులకు చేరగా, మిగిలితా నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి. అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.500,రూ.200 నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ. అయితే ఇటీవల నుంచి రూ.200 నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగానే ఇప్పుడు 200 నోటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే అడుగు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 500 మరియు 200 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్కరి జేబులో 200 లేదా 500 రూపాయల నోటు ఉండటం మీరు గమనించి ఉంటారు.

మోడీ ప్రభుత్వం ఈ నోట్లను నిషేధిస్తుందా?

దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మార్కెట్లో నకిలీ 200 రూపాయల నోట్లు వస్తున్నాయని, నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది. కొందరు 200 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని, అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది. 2000 రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ 200, 500 రూపాయల నోట్ల చెలామణి నిరంతరం పెరుగుతోందని ఆర్‌బిఐ తెలిపింది. ఇలాంటి పరిస్థితిని క్యాచ్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోకి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇటీవల తెలంగాణలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ 200 రూపాయల నోట్లు:

మీ జేబులో ఉన్న 200 రూపాయల నోటు నకిలీదో కాదో తెలుసుకోవడం ఎలా? దీన్ని తెలుసుకోవడానికి, మీరు దానిని గుర్తించాలి. 200 రూపాయల నోటుకు ఎడమవైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంది. మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అలాగే ‘RBI’, ‘భారత్’, ‘ఇండియా’, ‘200’ చాలా చిన్న అక్షరాలతో అంటే మైక్రో ఫాంట్‌లో రాసి ఉంటుందని తెలిపింది. కుడి వైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుందని తెలిపింది.

నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. లావాదేవీల సమయంలో నోట్లను సరిగ్గా చెక్ చేసుకోవాలని సూచించింది. ఎవరైనా నకిలీ నోటును గుర్తించినట్లయితే, వెంటనే దానిని స్థానిక పరిపాలన లేదా సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేయాలని RBI తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..