బడ్జెట్ వేళ నిర్మలా సీతారామన్ కట్టిన చీర సీక్రెట్ తెలుసా? వీడియో
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చేనేత చీరలకే ప్రాధాన్యమిస్తోన్న నిర్మలమ్మ.. ఈసారి కూడా అదే రకం చీరలో కనిపించారు. ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ఆసక్తిగా నిలుస్తాయి.
చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది.దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి.. మంత్రికి కానుకగా ఇచ్చారు. సీతారామన్ ఓ కార్యక్రమం నిమిత్తం బిహార్‌లోని మధుబనికి వెళ్లినప్పుడు ఆమెను కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారీ తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను ఆర్థికమంత్రికి బహూకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలని కోరారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. మదుబని ఆర్ట్‌తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీ దేవిని కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో

నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్ కింద రూ.3 కోట్ల ఇల్లు

రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. వీడియో

తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..వీడియో

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో
