పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
రూ.1500 పింఛన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుని 9 కిలోమీటర్లు నడిచిన కోడలి ఘటన దేశాన్ని కదిలిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ‘డిజిటల్ ఇండియా’ వాస్తవాలను బయటపెట్టింది. బ్యాంకుకు స్వయంగా రావాలన్న నిబంధనతో అడవులు, కొండలు దాటి అత్తను తీసుకెళ్లిన కోడలి కష్టం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభుత్వాలు ‘డిజిటల్ ఇండియా’, ‘ఇంటి వద్దకే సంక్షేమ సేవలు’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కట్టే హృదయవిదారక ఘటన ఇది. కేవలం నెలకు వచ్చే రూ.1500 పింఛను కోసం ఓ కోడలు తన 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుంటూ, ఎండలో అడవులు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్లు నడిచి తీసుకువెళ్లిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాలోని మైన్‌పాట్ మారుమూల గిరిజన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుఖ్మానియా బాయి అనే మహిళ .. వృద్ధులరాలైన తన అత్తకు పెన్షన్ ఇప్పించడం కోసం ఆమెను వీపుపై వేసుకుని ఏకంగా 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు స్వయంగా బ్యాంకుకు వచ్చి వేలిముద్ర వేస్తేనే డబ్బులు ఇస్తామని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో, ఆమెకు ఈ కష్టం తప్పలేదు. “మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లాలి. గతంలో పింఛను డబ్బులు ఊరికి తీసుకొచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బ్యాంకుకు వచ్చి తీసుకోమని చెప్పడంతో ఇలా తన అత్తను మోసుకు వచ్చానని సుఖ్మానియా బాయి తన ఆవేదన వెలిబుచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యవస్థలోని లోపాల వల్ల మారుమూల ప్రాంతాల్లో కనీస సంక్షేమ ఫలాలు అందుకోవడం కూడా ఎంత కష్టతరంగా మారిందో ఈ ఘటన నిరూపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

