నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
మహారాష్ట్రలో మండుతున్న ఎండల కారణంగా దాహంతో అలమటించిన కోతులు బస్సును అడ్డుకున్న ఘటన వైరల్‌గా మారింది. యవత్మాల్ జిల్లాలో ప్రయాణికులు వాటికి నీళ్లు అందించి దాహం తీర్చారు. ఈ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అడవుల్లో నీటి సదుపాయాలు కల్పించడంలో అటవీశాఖ నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోయాయి. ఎండ తీవ్రతకు తాళలేక, దాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ కోతి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఘటన యవత్మాల్ జిల్లాలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖండాలా ఘాట్ సమీపంలోకి రాగానే.. ఓ కోతి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత అదిలించినా అది పక్కకు తప్పుకోలేదు. ఆ మూగజీవి దాహంతో అలమటిస్తోందని గ్రహించిన కొందరు ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో దానికి నీరు అందించారు. బాటిల్ లోంచి నీళ్లు తాగుతున్న కోతిని చూసిన వెంటనే, సమీప అడవిలో నుంచి మరికొన్ని కోతులు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు చుట్టూ చేరాయి. ఆకలి దప్పులతో ఉన్న ఆ మూగజీవాలను చూసి చలించిపోయిన ప్రయాణికులు, తమ వద్ద ఉన్న నీటిని వాటికి అందించి దాహం తీర్చారు. బస్సులోని ప్రయాణికురాలు.. హృదయానికి హత్తుకునే ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్రలో ఎండలు మండిపోతున్నాయి, మూగజీవాలు ఇలా ఇబ్బంది పడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో, వేసవిలో అటవీ జంతువుల కోసం కనీస నీటి సదుపాయాలు కృత్రిమ నీటి కుంటలు ఏర్పాటు చేయని అటవీశాఖ అధికారుల తీరుపై నెటిజన్లు, స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అడవిలో నీరు దొరక్కపోవడం వల్లే జంతువులు ఇలా రోడ్ల పైకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్.. బర్త్‌డే వేడుకలు వైరల్
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా

