రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో

రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో

Samatha J

|

Updated on: Feb 02, 2025 | 11:16 AM

ప్రస్తుత కాలంలో సెల్‌ ఫోన్‌ లేనిదే రోజు గడవడం కష్టంగా మారింది. అడుగు పడాలంటే సెల్‌ చేతిలో ఉండాల్సిందే. మొబైల్‌కు అంతగా కనెక్ట్‌ అయిపోయారు జనాలు. కొందరైతే సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ ప్రపంచాన్నే మర్చిపోతారు. అసలు తామెక్కడున్నారో కూడా గమనించుకోరు. రోడ్డు మీద నడుస్తూ, వాహనాలు నడుపుతూ సెల్‌ మాట్లాడతారు.. ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.

 ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతుంటారు. అలా ఫోన్‌ మాట్లాడుతూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ యువకుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతగాడి వెనుక నుంచి రైలు వేగంగా వస్తున్న విషయం కూడా అతను గమనించడం లేదు. అంతగా మునిగిపోయాడు ఫోన్‌లో. ట్రాక్‌పైన యువకుడు కూర్చుని ఉండటం గమనించిన లోకోపైలట్‌ రైలు ఆపడంతో రైలు దగ్గరగా వచ్చిన తర్వాత యువకుడు ఈ లోకంలోకి వచ్చాడు. వెంటనే ట్రాక్‌ పైనుంచి లేచి పక్కకు వెళ్లాడు. అయితే యువకుడి తీరుకు ఆగ్రహించిన లోకోపైలట్‌ ట్రైన్‌ దిగివచ్చి యువకుడిని మందలించబోయాడు. వెంటనే యువకుడు లోకోపైలట్‌ తనను కొడతాడేమోనని అక్కడ్నుంచి పరుగందుకున్నాడు. లోకోపైలట్‌ పారిపోతున్న ఆ యువకుడిపైకి రాయి విసిరాడు. దాంతో యువకుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైగా లైక్‌ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం :

బిగ్ వార్నింగ్‌! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!

గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్‌ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది

పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!