బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
చాలా మంది ఇతరులకు అందంగా కనపడాలని ఆశపడుతుంటారు. అందుకోసం రకరకాల కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వారికి ఇదొక షాకింగ్ న్యూస్. ఇప్పటికే మీరు కాస్మెటిక్స్ వాడుతున్నట్లయితే మానేస్తేనే బెటర్ అంటూ కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవల ఓ హెచ్చరిక చేశారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు ఆమె తెలిపారు. మెర్క్యూరీ స్థాయి ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల్ని కేరళలో అమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కాస్మెటిక్ ఉత్పత్తులను లైసెన్స్ ఉన్న కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె తన ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ప్రోడక్ట్‌ను కొనేముందు ఉత్పత్తిదారుడి అడ్రస్‌ను తెలుసుకోవాలన్నారు.కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సౌందర్యను మొదలుపెట్టారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ప్రమాకర కెమికల్స్ గుర్తిస్తున్నారు. ఫేక్ ఉత్పత్తుల్ని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఉత్పత్తులను సీజ్ చేసి కేసులు నమోదు చేసశారు. లిప్‌స్టిక్, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవల్స్ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. కొన్ని శ్యాంపిళ్లలో మెర్క్కూరీ లెవల్స్ సుమారు 12 వేల రెట్లు అధికంగా ఉన్నట్లు పసికట్టారు. ఇలాంటి ప్రమాదకర రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
