ఖర్జూరంతో అరటిపండును కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
సీజన్‌తో సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా పండుతుంది. పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం... శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా సమర్పించి పంచే పవిత్ర ఫలం... అదే మనందరికీ సుపరిచితమైన అరటిపండు. పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే.
కానీ అరటి పండు మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మృదువుగా ఉంటుంది కాబట్టి అన్నం కన్నా ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం కూడా ఇదే. నిజానికి రోజుకో ఆపిల్ తింటే వైద్యుడితో పని ఉండదు అంటారు కానీ, రోజుకో అరటిపండు తిన్నా చాలు, సకల రోగాల నుంచీ సంరక్షిస్తుంది. అయితే అరటిపండును ఖర్జూరంతో కలిపి తింటే మరింత మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు వీటి నుంచి లభిస్తాయి. ఖర్జూరంతో అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది