పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!
అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చీ రాగానే డొనాల్డ్ ట్రంప్ పదులకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో ఒకటి జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయడం..! ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. ఈక్రమంలోనే తాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకైనా వెళ్తానని చెప్పారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos