భూమి తిరగడాన్ని చూశారా? వీడియో
భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్.. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి వీడియో తీశారు.
ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా క్రోడీకరించారు. ఇందులో భూమి ఎలా భ్రమిస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. దీనిని వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు అంగ్‌చుక్ తెలిపారు. భూ భ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. లద్దాఖ్‌లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండడం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పని చేయకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకువెళ్లానని అన్నారు.
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది
పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!
రంజీ ప్రాక్టీస్‌లో కోహ్లీ స్టైల్ చూశారా!
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు !
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

