దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే పాలన అన్నట్లు... దేశంలోనే ఫస్ట్ టైమ్ వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. 161 రకాల వాట్సాప్ సేవలను ప్రారంభించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం గతేడాదే మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు.
ఇకిప్పుడు పక్కా ప్లాన్‌తో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక నెంబర్‌ను ప్రకటించనుంది. ఆ వాట్సాప్ అకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఆ నంబరు ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది ఏపీ ప్రభుత్వం. దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు అందులో ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే… ఈ వాట్సప్ ఖాతా ద్వారానే సందేశం పంపించనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో వాట్సాప్ మేసేజ్‌ల ద్వారానే అలర్ట్ చేయనుంది.
మరిన్ని వార్తల కోసం :
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
మరో భార్యాబాధితుడి ఆత్మ*హ*త్య.. ఎక్కడంటే? వీడియో
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
