AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

Phani CH
|

Updated on: May 27, 2026 | 4:31 PM

Share

15 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన కుమారుడు సోషల్ మీడియా వల్ల తిరిగి ఇంటికి చేరిన ఘటన పశ్చిమబెంగాల్‌లో భావోద్వేగాన్ని కలిగించింది. బంగ్లాదేశ్‌లో వైరల్ వీడియోలో తన కొడుకు పోలికలు గమనించిన తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించారు. చివరకు విదేశాంగ శాఖ సహకారంతో నజీముల్ భారత్‌కు చేరుకుని కుటుంబాన్ని కలుసుకోవడంతో గ్రామమంతా కన్నీటి పర్యంతమైంది.

‘నా బిడ్డ నజీముల్ ను మళ్లీ చూస్తానని అస్సలు అనుకోలేదు. నా కొడుకుని ఒక్కసారి నా కళ్లకు చూపించమని రోజూ అల్లాను ప్రార్థించేదాన్ని. 15 ఏళ్ల తర్వాత ఈనాటికి నా కోరిక తీరింది.. ఇంతకంటే పెద్ద ఆనందం నాకు లేదు” అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సామాజిక మాధ్యమాలు ఒక ముగింపు పలికాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లా ఇస్లాంపుర్‌కు చెందిన నజీముల్ అనే బాలుడు, 15 ఏళ్ల కిందట అనుకోకుండా సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోవడంతో తండ్రి మారుఫ్‌ అలి దంపతులు అన్నిచోట్లా వెతికారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆశ వదులుకున్నారు. సరిగ్గా ఏడాది కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆ కుటుంబంలో ఆశలు రేకెత్తించింది. బంగ్లాదేశ్‌లో ఉన్న వ్యక్తుల గురించిన ఆ వీడియోలో నజీముల్‌పోలికలున్న వ్యక్తిని చూసిన ఆ తల్లిదండ్రులు.. అతడు తమ కుమారుడని అనుమానించారు. వెంటనే స్థానిక ఎంపీ ఇషాఖాన్‌ చౌధరిని ఆశ్రయించారు. ఎంపీ చొరవ తీసుకుని ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపారు. అధికారుల సహకారంతో ఎట్టకేలకు గురువారం నజీముల్ సురక్షితంగా భారతదేశానికి చేరుకుని తన కన్నవారిని కలుసుకున్నాడు. బాలుడిగా తప్పిపోయి.. దశాబ్దన్నర కాలం తర్వాత వచ్చిన కొడుకును గుండెలకు హత్తుకున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ భావోద్వేగ దృశ్యాన్ని చూసి గ్రామస్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్

Follow Us