Budget 2025 Highlights: కేంద్ర బడ్జెట్.. మధ్యతరగతులకు భారీ ఊరట.. రూ. 12 లక్షల వరకు నో టాక్స్
Budget Session 2025 Parliament LIVE: లోక్‌సభలో బడ్జెట్‌ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్‌లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా లక్షలన్న రోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
LIVE NEWS & UPDATES
-
పెరిగేవి ఇవే
దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్
ప్రేమియం టీవీలు
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానల్ డిస్‌ప్లేలు
అల్లిన బట్టలు
-
రూపాయి రాక.. పోక ఇలా..
-
-
బడ్జెట్ హైలైట్స్
బీమారంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకు అవకాశం కల్పించారు. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. క్యాన్సర్ ఔషధాలు, సర్జికల్ పరికరాలపై సుంకాలు తగ్గించారు. లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపుతో Led టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి.
-
బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్‌లో వేతనజీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. 12 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ మినహాయించింది. 12 నుంచి 16 లక్షల వరకు 15 శాతం, 16 నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20శాతం, 20 నుంచి రూ.24 లక్షల వరకు 25శాతం పన్ను విధిస్తారు. వచ్చే వారం కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
-
బడ్జెట్ హైలైట్స్
వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
-
-
బడ్జెట్ హైలైట్స్
సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా లక్షలన్న రోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు.
-
బడ్జెట్ హైలైట్స్
తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్‌లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు.
-
బడ్జెట్ హైలైట్స్
గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు నిర్మల. కంది, మినుములు, మైసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తెస్తున్నారు. స్టార్టప్‌ల కోసం 20 కోట్ల వరకు, MSMEలకు 10 కోట్ల వరకు రుణాలిచ్చేందుకు నిర్ణయించారు.
-
బడ్జెట్ హైలైట్స్
ఈ బడ్జెట్‌లో పోస్టల్ రంగానికి ఊపిరిలూదారు నిర్మల. MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. పీఎం ధన్‌ధాన్య యోజనతో కోటి 70 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించారు.
-
బడ్జెట్ హైలైట్స్
ప్రధాని ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించారు నిర్మల. ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో కొత్త పథకం అమలు చేస్తామన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని మూడు నుంచి 5 లక్షలకు పెంచారు.
-
బడ్జెట్ హైలైట్స్..
లోక్‌సభలో బడ్జెట్‌ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు.
-
మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట
— రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు
— రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి శ్లాబులవారీగా పన్ను
— రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
— రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% శాతం పన్ను
— రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను
— ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు
— మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట
-
తగ్గేవి ఇవే
చేనేత వస్త్రాలు
తోలు వస్తువులు
మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ
ఎలక్ట్రిక్ వెహికల్స్
భారతదేశంలో తయారైన దుస్తులు
వైద్య పరికరాలు
క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు
పలు రకాల ఖనిజాలు
-
రూ. 12 లక్షల వరకు నో టాక్స్
— రూ.12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
— రెట్టింపు అయిన ఆదాయ పన్ను మినహాయింపు
— మధ్య తరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమన్న ప్రభుత్వం
— ఆదాయ పన్ను శ్లాబుల సంఖ్య తగ్గింపు
-
Nirmala Sitharaman Speech: 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు
వేతన జీవులకు భారీ ఊరట
రూ. 12 లక్షల ఆదాయం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు
-
Nirmala Sitharaman Speech: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన
దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలాసీతారామన్.
-
Nirmala Sitharaman Speech: TDS, TCS రేట్ల తగ్గింపు
— మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం
— నిబంధనలు, పదాలు దాదాపు 50 శాతం తగ్గింపు
— భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం
— మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను
— TDS, TCS రేట్ల తగ్గింపు
— సీనియర్ సిటిజన్లకు TDS, TCS మినహాయింపు మొత్తం రూ.1 లక్షలకు పెంపు
-
నిర్మల బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట
- నిర్మల బడ్జెట్ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట
- వచ్చేవారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు ప్రవేవపెడతాం
- సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
- మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
- బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంపు
- బీమాలో FDI 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతి
- లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు
-
Nirmala Sitharaman Speech: దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధిమెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనల సరళీకరణసంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులుమూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లునగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్విద్యుత్ రంగంలో సంస్కరణలుఅంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళికవికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్భూరికార్డుల డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యంహోమ్ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలుIIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులుఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదుకోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం -
బడ్జెట్ ప్రకటన.. సెన్సెక్స్ క్రాష్
బడ్జెట్ ప్రకటిస్తుండటంతో.. ఒక్కసారిగా లాభాల్లో పడ్డ సెన్సెక్స్.. ఇప్పుడు క్రాష్ అయ్యాయి.
-
Nirmala Sitharaman Speech: పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు
పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు
వచ్చేవారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు ప్రవేవపెడతాం
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తాం
-
కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కు భారీగా కేటాయింపులు
బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తాం
కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు
బిహార్‌లో ఈ సంస్థ ఏర్పాటు
మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
IIT పాట్నా విస్తరిస్తాం
బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం
ఇందులో భాగంగా పాట్నా ఎయిర్‌పోర్టు విస్తరణ
వెస్టర్న్ కోసి ప్రాజెక్టుకు మంజూరు
బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
-
Nirmala Sitharaman Speech: పట్టణాభివృద్ధికి రూ.లక్ష కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.లక్ష కోట్లు
నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్
అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్‌డీపీలో 0.5శాతం పెంపు
అణుఇంధన రంగంలో సంస్కరణలు
2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం
-
Nirmala Sitharaman Speech: వచ్చే ఏడాది అదనంగా 10 వేల మెడికల్ సీట్లు
రానున్న ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు
వచ్చే ఏడాది అదనంగా 10 వేల మెడికల్ సీట్లు
వర్తకులకు 30 వేల పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
కొత్త పథకాల అమలుకు రూ.10 లక్షల కోట్లు
జల్‌జీవన్ మిషన్ కింద దేశంలోని ఇంటింటికీ తాగునీరు
జల్‌జీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగింపు
-
Nirmala Seetharaman Speech: బడ్జెట్ స్పీచ్..
ఐదు ఐఐటీల ఆధునీకరణ
AI రంగంలో CoE
దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు
200 ఈ-కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు
పీఎం స్వనిధి పథకం కింద రుణాల పెంపు
-
Nirmala Sitharaman Speech: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్‌లు
బడ్జెట్ డే నాడు స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి.. సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగబాకింది.
-
Nirmala Seetharaman Speech: స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు
స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు
MSMEలకు రూ.20 కోట్ల వరకు రుణాలు
తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి చేయూత
కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్
మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు
అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
-
Nirmala Sitharaman Speech: కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు
రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్న కేంద్రం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
-
Nirmala Sitharaman Speech: ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన ప్రకటించిన నిర్మల
ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన ప్రకటించిన నిర్మల
ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది
దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం
గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన
-
Nirmala Sitharaman Speech: పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
— అధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ
— గురజాడ పద్యాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్
— వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు
— ఆరు రంగాల్లో సమూల మార్పులు
— పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
— ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన
— 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
— వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి
— పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక
-
నిర్మలమ్మ నోట గురజాడ మాట
గురజాడ అప్పారావు చెప్పిన *దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి*
-
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్..
లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు విపక్షాలు నిరసన తెలిపాయి. ఇక నిరసనలు మధ్యే ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
Union Finance Minister Nirmala Sitharaman presents #UnionBudget2025 pic.twitter.com/GRJNA1NNqG
— ANI (@ANI) February 1, 2025
-
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
— బడ్జెట్‌కు ఆమోదం తెలపడానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశం అయింది.
— ఈ కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ కీలకవ్యాఖ్యలు చేశారు.
— ఇది సామాన్యుల బడ్జెట్ అని మోదీ అన్నారు.
— మహిళలు, యువకుల ఆశల బడ్జెట్ అన్నారాయన.
— ఇది పేదలు, రైతుల బడ్జెట్ అని కేబినెట్ భేటీలో మోదీ వ్యాఖ్యానించారు.
— మొత్తానికి ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో మోదీ మరోసారి బిగ్ హింట్ ఇచ్చారు.
— పేదలు, మధ్యతరగతి వర్గాలను మహాలక్ష్మి కరుణించాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నిన్న చెప్పారు.
-
పార్లమెంటు సమావేశం ప్రారంభం
— పార్లమెంటు సమావేశం ప్రారంభం
— బడ్జెట్‌కు రాష్ట్రపతి అనుమతి తీసుకున్న ఆర్థికమంత్రి
— వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
— ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
-
వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలు..
— కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాలు పెంచేసింది.
— వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి.
— వార్షికాదాయం రూ.10లక్షల వరకు ఉన్నవారిని ఆదాయపు పన్ను నుంచి మినహాయించవచ్చంటూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు వచ్చాయి.
— కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల నుంచి పెంచుతారా అన్నదే అసలు పాయింట్.
— పేదలు, మధ్యతరగతికి లక్ష్మీకటాక్షం ఉండాలంటూ నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో ఆశలు అమాంతం పెరిగిపోయాయి.
— ఒకవైపు నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది వృద్ధిరేటు.
— ఆర్థికవ్యవస్థలో స్పీడ్ పెంచే బడ్జెట్ ఫార్ములాలపై ఉత్కంఠ నెలకొన్నది.
-
కేంద్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
పార్లమెంటు భవనంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది.
— కేంద్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
— మరో అరగంటలో, అంటే ఉదయం 11గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
— రైల్వేలకు బడ్జెట్ కేటాయింపు 15-18 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
— బడ్జెట్‌లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నారు.
— వందేభారత్ స్లీపర్, బుల్లెట్ రైలుపై ప్రకటనకు చాన్స్ ఉంది.
— రైల్వే ట్రాక్ విస్తరణ, ఆధునికీకరణ కోచ్‌లు, వ్యాగన్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
— జాతీయ రహదారులకు బడ్జెట్ 5-6 శాతం పెరిగే చాన్స్ ఉంది.
-
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం
పార్లమెంట్‌లోనే భేటీకానున్న కేబినెట్
బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్
-
కేంద్ర బడ్జెట్ లైవ్ వీడియో..
-
ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్
ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్
ఉ.11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మల
ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీతారామన్
2025 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
-
క్రిప్టో కరెన్సీపై కేంద్రం మాటేంటి.?
బిట్‌కాయిన్ ధర బీభత్సంగా పెరుగుతోంది. అయినా మన భారత్ నో ఇంట్రస్ట్. అమెరికా వేలకోట్ల డాలర్ల్ ఇన్వెస్ట్ చేస్తోంది. అయినా మన ప్రభుత్వం నో ఇంట్రస్ట్. ప్రపంచదేశాల చూపు ఇప్పుడు డిజిటల్ కరెన్సీపై పడింది. మరి మారిన పరిస్థితుల దృష్ట్యా మోదీ సర్కార్ కూడా ఆదిశగా ఆలోచిస్తుందా..క్రిప్టోకు ఊపునిచ్చేలా చర్యలు తీసుకుంటుందా…?
-
అమరావతి నిర్మాణం కోసం..
అమరావతి నిర్మాణానికి గత బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లను కేటాయించారు. అయితే ఇవన్నీ అప్పులే. దీంతో పనులు వేగంగా నిర్వహించేందుకు ఈ బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించాలని అభ్యర్ధిస్తోంది. దావోస్ టూర్ తర్వాత నేరుగా ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయి…రాష్ట్రానికి అవసరమైన నిధులపై చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల ఆధారంగా తమ తమ రాష్ట్రాల్లో బడ్జెట్ పై రెండు రాష్ట్రాలు కసరత్తు చేయనున్నాయి.
-
కేంద్రంపై ఏపీ భారీ ఆశలు..
ఏపీ కూడా కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం, అమరావతి విషయంలో 2024 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చింది .పోలవరం ప్రాజెక్టుకు రూ. 12500 కోట్లను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో కొంత మేరకు విడుదల కూడా చేసింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభత్వం లక్ష్యంగా పెట్టుకొంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
-
ఆర్ఆర్ఆర్‌కు రూ.34,367 కోట్లు.. మెట్రో రెండో దశకు రూ.24, 269 కోట్లు
అలాగే ఆర్ఆర్ఆర్ కు రూ.34,367 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సమర్పించాయి. మరో వైపు హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ.24, 269 కోట్లు అవసరమవుతాయి. ఇక మూసీ పునరుజ్జీవం కోసం రూ. 14, 100 కోట్లను కేంద్రం ఇవ్వాలని అభ్యర్ధిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని… వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లు రావాల్సి ఉందని బడ్జెట్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గుర్తు చేస్తోంది.
-
తెలంగాణలో పధకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం..
తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో భారీ ప్రాజెక్టలకు శ్రీకారం చుట్టింది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. ఈప్రాజెక్టుల కోసం రూ. 1.63 లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. పెద్దన్న మాదిరిగా రాష్ట్రాభివృద్దికి సహకరించాలని గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
-
బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల భారీ ఆశలు
కేంద్రబడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అసలు ఉచిత పథకాలతో రెండు రాష్ట్రాలు ఆర్ధికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్నాయి. మరి ఈబడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఆశలను కేంద్రం నెరవేరుస్తుందా..? భారీ ప్రాజెక్టులకు కేంద్రం సపోర్ట్ ఉంటుందా..?
Published On - Feb 01,2025 7:25 AM