AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్ అన్ని సేవలు.. అందుబాటులోకి అద్భుత యాప్!

భారతీయ రైల్వే సూపర్ యాప్‌ను సిద్ధం చేసింది. దీనిని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించింది. ప్రయాణికులకు అన్ని అసౌకర్యాలు ఒకే యాప్ ద్వారా కల్పించేందుకు దీన్ని సిద్ధం చేశారు. ఈ యాప్‌లో, వినియోగదారులు మళ్లీ మళ్లీ సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్ అన్ని సేవలు.. అందుబాటులోకి అద్భుత యాప్!
IRCTC తత్కాల్ ఛార్జీలు: సాధారణ టికెట్ ఛార్జీకి అదనంగా తత్కాల్ ఛార్జీలు జోడిస్తారు. రెండవ తరగతికి ప్రాథమిక ఛార్జీలో 10 శాతం ఛార్జీ ఉండగా, మిగతా అన్ని తరగతులకు ఇది 30 శాతం. అయితే ఈ ఛార్జీలు కనీస, గరిష్ట పరిమితులకు లోబడి ఉంటాయి. అయితే మీరు వెళ్లే దూరాన్ని బట్టి తత్కాల్‌ టికెట్లపై ఛార్జీలు ఉంటాయని గుర్తించుకోండి.
Balaraju Goud
|

Updated on: Jan 31, 2025 | 9:05 PM

Share

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అద్భుతమైన యాప్ తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వే భారీ సన్నాహాలు చేస్తోంది. ఇండియన్ రైల్వే సూపర్ యాప్‌ను సిద్ధం చేసింది. దీనిని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించింది. ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇంటర్‌ఫేస్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ యాప్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

ఈ యాప్‌లో, వినియోగదారులు మళ్లీ మళ్లీ సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒకే సైన్ ఆన్‌తో దాని అన్ని సేవలను ఉపయోగించవచ్చు. అంతే కాదు, ఇది IRCTC RailConnect, UTS మొబైల్ యాప్ మొదలైన భారతీయ రైల్వేలకు చెందిన ఇతర యాప్‌లలో కూడా పని చేస్తుంది. సాధారణ భాషలో అర్థం చేసుకుంటే, ఇది ఒకే యాప్‌లో అన్నీ సేవలు ముందు ప్రత్యక్షమవుతాయి.

ప్రస్తుతం, రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ బుకింగ్ కోసం వేర్వేరు యాప్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, రైలు కదలిక, తేదీ లైన్ చూడటానికి ప్రత్యేక యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో, అన్ని సేవలు ఒకే చోట రూపొందించడం జరిగింది. ఉదాహరణకు, PNR ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, సంబంధిత రైలు గురించిన సమాచారం కూడా చూపిస్తుంది. దాని సహాయంతో, ఆన్‌బోర్డింగ్ లేదా సైన్ అప్ చేయడం చాలా సులభం అవుతుంది. వినియోగదారులు తమ ప్రస్తుత RailConnect లేదా UTS యాప్ ఆధారాలను ఉపయోగించి సూపర్ యాప్‌కి సులభంగా సైన్ అప్ చేయవచ్చు.

సైన్ అప్ ప్రక్రియను సులభతరం చేయడానికి, యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి ఇది రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది లాగిన్ చేయడం కూడా చాలా సులభం. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, విభిన్న లాగిన్ ఎంపికలు అందించారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత, యాప్‌ని తర్వాత mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ