AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: కొత్తగా వంట నేర్చుకుంటున్నారా..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

వంట చేయడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే కిచెన్ పనులు సులభమవుతాయి. ఉడికిన గుడ్ల పొట్టు తొలగించాలంటే అవి చల్లటి నీటిలో వేయాలి. చికెన్ త్వరగా ఉడికించాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా ఉడికించాలి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వంట వేగంగా, సులభంగా పూర్తవుతుంది.

Kitchen Hacks: కొత్తగా వంట నేర్చుకుంటున్నారా..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Kitchen Hacks
Prashanthi V
|

Updated on: Jan 31, 2025 | 9:28 PM

Share

వంట చేసే పనులు చాలా మందికి కష్టంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకుంటున్న వారికి చిన్న పనులే చాలా సమయం తీసుకుంటాయి. అయితే కొన్ని స్మార్ట్ టిప్స్ ఫాలో అయితే కిచెన్ పనులు చాలా సులభమవుతాయి. ఉడికిన గుడ్ల పొట్టు ఈజీగా తీయడం, చికెన్ త్వరగా ఉడికించడం, చిన్న ఉల్లిపాయల తొక్క తొలగించడం లాంటి పనులు ఇకపై కష్టంగా అనిపించవు. ఈ సింపుల్ చిట్కాలు పాటించి మీరు కూడా కిచెన్ మాస్టర్ అవ్వండి.

గుడ్డు పొట్టు తీయడం ఇంత ఈజీనా..!

గుడ్లు ఉడికించిన తర్వాత వాటి పై పొట్టు తొలగించడానికి కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. కానీ చిన్న ట్రిక్ ఫాలో అయితే ఈ పని చాలా సులభంగా మారుతుంది. గుడ్లు ఉడికిన వెంటనే వాటిని చల్లటి నీటిలో లేదా ఐస్ క్యూబ్స్ ఉన్న కంటెయినర్‌లో వేయండి. కొన్ని నిమిషాల తర్వాత గుడ్ల పెంకులు తేలికగా ఊడిపోతాయి.

చికెన్ కి సింపుల్ ట్రిక్

చాలా మంది చికెన్‌ని ఫ్రిజ్‌లో పెట్టి వండడానికి ముందు బయటికి తీసి గంటల తరబడి వెయిట్ చేస్తారు. అయితే ఇలా చేయాల్సిన అవసరం లేదు. చికెన్ త్వరగా ఉడికించాలంటే ముందుగా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి. తర్వాత వంటలో ఉపయోగిస్తే చికెన్ చాలా త్వరగా ఉడుకుతుంది.

కొత్తిమీర ఆకులు సులభంగా తీయండిలా..!

కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా వాడతాం. కానీ వాటి ఆకులు ఒక్కొక్కటిగా తీయడానికి చాలా సమయం పడుతుంది. దీన్ని సులభంగా చేయాలంటే ఓ చిన్న కంటెయినర్ లేదా జల్లెడ ఉపయోగించండి. కొత్తిమీర కాడలను కంటెయినర్ రంధ్రాల మధ్య ఉంచి నెమ్మదిగా లాగండి. దీంతో కాడలు బయటకు వచ్చేస్తాయి. ఆకులు మాత్రం లోపలే ఉండిపోతాయి.

ఉల్లిపాయలకు సింపుల్ టిప్

చిన్న ఉల్లిపాయల తొక్క తీసేయడం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే చిన్న ట్రిక్ పాటిస్తే అవి సులభంగా ఊడిపోతాయి. ముందుగా ఉల్లిపాయల రెండు చివర్లను కట్ చేయండి. తర్వాత వాటిని వేడినీటిలో కొద్ది నిమిషాలు ముంచి ఉంచండి. కొద్దిసేపటి తర్వాత ఈ ఉల్లిపాయల తొక్కలు చాలా ఈజీగా ఊడిపోతాయి.

ఈ చిట్కాలను ఫాలో అయితే వంట పనులు ఇక చాలా సులభంగా మారతాయి. సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు, పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. కిచెన్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వంట చేయడం ఆనందంగా ఉంటుంది.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్