Vastu Tips: మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా..? ఈ పొరపాట్లు వెంటనే సరిచేయండి..!
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక నష్టాలు, ఇతర సమస్యలు రావడం సహజం. వాస్తు శాస్త్రం ప్రకారం నీటి లీకులు, తలుపుల శబ్దం, బాత్రూమ్ శుభ్రత లేకపోవడం, పైకప్పుపై చెత్త ఉంచడం, గ్యాస్ స్టవ్‌పై పాత్రలు వుండటం, ఇంటి పరిసరాల్లో మురికిని తీసుకురావడం వంటివి మీ ఇంట్లో ప్రతికూల శక్తుల్ని ఆహ్వానిస్తాయి.

ప్రస్తుతం మనలో చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు నిలువడం లేదు. పొదుపుగా ఉన్నా ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. దీనికి ఇంట్లో వాస్తు దోషాలే కారణమంటున్నారు. వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించి ఆర్థిక నష్టం కలిగిస్తాయట. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ లీక్స్ ని సెట్ చేయండి
ఇంట్లో నీటి ట్యాంక్ లేదా పైపు నుంచి నీరు కారితే వెంటనే సరి చేయాలి. చిన్న చుక్క నీరు కూడా ధన నష్టం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణం, పడమర దిశలో నీరు పారకుండా చూసుకోవాలి.
తలుపుల శబ్దం వద్దు
తలుపులు తెరవడానికి, మూయడానికి శబ్దం చేయకూడదు. అలాగే తలుపులు రుద్దకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షించి ధన నష్టం కలిగించవచ్చు.
వాష్ రూమ్ క్లీనింగ్
బాత్రూమ్ తడిగా ఉంటే అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడూ బాత్రూమ్‌ను పొడిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అనవసరమైన చెత్త వద్దు
ఇంటి పైకప్పుపై చెత్త లేదా పాత వస్తువులు ఉండకూడదు. ఇది పితృ దోషాన్ని కలిగించడంతో పాటు ఇంటి సభ్యుల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది.
గ్యాస్ స్టవ్‌పై పాత్రలు
వాస్తు ప్రకారం.. వండిన పాత్రలను గ్యాస్ స్టవ్‌పై ఉంచడం శుభం కాదు. ఇది లక్ష్మీదేవిని కోపపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.
పరిశుభ్రంగా ఇంటి పరిసరాలు
ఇంట్లో పేరుకుపోయిన మురికి, చెత్త వల్ల ప్రతికూల శక్తులు చేరుతాయి. సాలె పురుగులు, వాటి గూడులు ఉంటే ఇంట్లో ధన నష్టం తప్పదు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
వాస్తు దోషాలను సరిచేసి ఇంట్లో శుభ వాతావరణాన్ని ఏర్పరచుకుంటే ధన నష్టం తగ్గించి, సంపద నిలవబెట్టుకోవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.