AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: వేప నూనెతో మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా..!

ప్రస్తుతం జుట్టు సమస్యలతో బాధపడేవారికి వేప నూనె ఒక మంచి పరిష్కారం. వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వేప నూనెను ఇంట్లో సులభంగా తయారు చేసి జుట్టు కేర్ రొటీన్‌లో చేర్చుకోవచ్చు. ఈ నూనెను స్కాల్ప్‌పై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, జుట్టు బలంగా, పొడుగ్గా పెరుగుతుంది.

Hair Care: వేప నూనెతో మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా..!
Neem Oil Benefits
Prashanthi V
|

Updated on: Jan 31, 2025 | 10:39 PM

Share

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు జుట్టుతో పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, పేలు, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు బాగా చూస్తుంటాం. అయితే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం వేప నూనె అంటున్నారు వైద్య నిపుణులు. వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు, చర్మ సమస్యలను తగ్గించే లాభాలు అందిస్తాయి. వేప నూనెని ఇంట్లోనే తయారు చేసి జుట్టు కేర్ రొటీన్‌లో భాగంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వేప నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారీ విధానం

తాజా వేపాకులను తీసుకుని బాగా క్లీన్ చేయండి. ఆ ఆకులను గ్రైండ్ చేసి పేస్టులాగా చేయండి. ఈ పేస్టును కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌లో కలిపి మిశ్రమంలా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేయాలి. వేడి చేసే సమయంలో నూనె రంగు మారుతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసి గాజు సీసాలో నూనెని స్టోర్ చేయండి.

వేప నూనెను వాడే పద్ధతి

ఇలా తయారైన వేప నూనెను వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. జుట్టుకు నూనెను రాసి స్కాల్ప్‌పై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా జుట్టు పెరుగుతుంది. ఈ నూనెను రాసిన తర్వాత 1 గంట సమయం వేచి ఉంచాలి. రాత్రంతా కూడా ఉంచవచ్చు. కానీ వేప నూనెకు కొంత చేదు వాసన ఉంటుంది. కాబట్టి గంటసేపు ఉంచిన తర్వాత మైల్డ్ షాంపుతో శుభ్రపరచడం మంచిది.

హెయిర్ కేర్ రొటీన్‌లో వేప నూనె

వేప నూనెను మీ షాంపూలో కలిపి జుట్టును శుభ్రపరచడం వల్ల మీ జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది. ఈ నూనెని కండీషనర్‌లో కలిపి జుట్టుకు అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాలు పాటు ఉంచాలి. ఆపై షాంపుతో శుభ్రం చేయండి. ఇది స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వేప నూనెతో కలిగే ప్రయోజనాలు

వేప నూనెలోని పోషకాలు జుట్టు రాలడం తగ్గించే పనిని చేస్తాయి. ఇది జుట్టును బలంగా, పొడుగ్గా పెంచుతుంది. వేపలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంతో చుండ్రును తగ్గిస్తుంది. వేప నూనెను తలపై రాస్తే.. జుట్టు మృదువుగా మారి, పేల సమస్య తగ్గుతుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది, అంతేకాదు, జుట్టు ఊడిపోకపోవడం, పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గిస్తుంది. వేప నూనె రెగ్యులర్‌గా రాస్తే, జుట్టు తెల్లపడటాన్ని నియంత్రిస్తుంది.

వేప నూనెని హెయిర్ కేర్ రొటీన్‌లో భాగంగా చేర్చడం వల్ల జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దీని సహాయంతో జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరిగిపోతుంది. కొంతమంది వ్యక్తులకు ఇది కొంత ఇబ్బంది కలిగిస్తే.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత వాడటం మంచిది.

బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..