AP Budget 2025: వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?
AP Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..

ఏపీలోఅసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు కేటాయించగా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించింది.
నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు ఆర్థిక మంత్రి. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్. రూ.3,22,359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయించింది. ఇక జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు, పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయించింది. ఇందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ శాఖకు 11636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు, ఇక రెవెన్యూ వ్యయం రూ. 251162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33185 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40635 కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్ర బడ్జెట్ తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది. అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కొట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి